JANASENA: వెనక్కి తగ్గిన పవన్..? తెలంగాణలో జనసేన పోటీ కష్టమే..!

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోడానికి ఇంకో పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీడీపీ పోటీకి గుడ్ బై చెప్పగా, లేటెస్ట్‌గా వైఎస్సార్‌టీపీ కూడా పోటీలో ఉండలేమని ప్రకటించింది. ఇదే బాటలో జనసేన కూడా నడవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 02:23 PM IST

JANASENA: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా..? పవన్ కల్యాణ్ (Pavan kalyan) తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతారా..? టీడీపీ (TDP) లాగే పోటీకి దూరంగా ఉంటారా..? అంటే ఇప్పటికైతే ఎలాంటి సమాధానం లేదు ఆ పార్టీ వర్గాల నుంచి. కానీ థర్డ్ లిస్ట్ తర్వాత ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉంచింది బీజేపీ. వాటిని జనసేన (Janasena) కోసమే అనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన పోటీలో లేకపోతే.. ఆ పార్టీతో పొత్తు ద్వారా సీమాంధ్రుల ఓట్లు దక్కించుకోవాలనుకున్న బీజేపీ (BJP) ఆశలు కూడా అడియాసలు అవుతాయి.
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోడానికి ఇంకో పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీడీపీ పోటీకి గుడ్ బై చెప్పగా, లేటెస్ట్‌గా వైఎస్సార్‌టీపీ కూడా పోటీలో ఉండలేమని ప్రకటించింది. ఇదే బాటలో జనసేన కూడా నడవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయాలని జనసేన అనుకుంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా ఢిల్లీలో జరిగాయి. తెలంగాణలో సీమాంధ్రులు తమకే ఓటేస్తారని జనసేన భావించింది. అందుకే హైదరాబాద్‌లో ఆ వర్గాల వారు బలంగా ఉన్న కూకట్‌పల్లి లాంటి ఏరియాలతో పాటు ఏపీ సరిహద్దుల్లోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సీట్లను అడిగింది. దాదాపు 32 సీట్లకు అభ్యర్థులను కూడా రెడీ చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే తెలంగాణ బీజేపీ నుంచి ఒక్కో నాయకుడు తప్పుకుంటున్నాడు. ఒకప్పుడు సెకండ్ పొజిషన్‌లో ఉన్న కమలం పార్టీ, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో సీట్లు రాకపోతే ఏంటి పరిస్థితి అని జనసేనాని డైలమాలో ఉన్నారు.

తెలుగుదేశంతో కలసి ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) అధికారంలోకి రావాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆ పార్టీ వాషవుట్ అయితే, ఆ ఎఫెక్ట్ ఏపీపైనా పడుతుంది. జనసేన బలం ఇంతే అన్న విమర్శలు కూడా వస్తాయి. తెలంగాణలో (Telangana) ఇప్పుడు సీమాంధ్రులు జనసేనకు ఓట్లు వేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికే ఆ వర్గం కాంగ్రెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పైగా సీమాంధ్రులు ఉన్న నియోజకవర్గాల్లో టిక్కెట్లను జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని స్థానిక బీజేపీ నేతలు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో తెలంగాణలో పోటీ చేసే నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ఆశలు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ దీనిపై క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు.