Annaram Saraswati Barrage : కాళేశ్వరం.. అన్నారం సరస్వతి బ్యారేజీ లో లీకేజీ.. ఆందోళన చెందుతున్న రైతులు

ఈ ప్రాజెక్టులో వరుస ఘటనలతో వార్తల్లోకి నిలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం అయిన సరస్వతి బ్యారేజీ లో లీకేజీలు తీవ్ర ఆందోళ రేకెత్తిస్తుంది. అన్నారం సరస్వతి బ్యారేజీ 28, 38 నంబర్ రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు పైకి ఉబికి వస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే తెలిసిన ఓ మాహ ప్రాజెక్టు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నది పై నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో వరుస ఘటనలతో వార్తల్లోకి నిలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం అయిన సరస్వతి బ్యారేజీ లో లీకేజీలు తీవ్ర ఆందోళ రేకెత్తిస్తుంది. అన్నారం సరస్వతి బ్యారేజీ 28, 38 నంబర్ రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు పైకి ఉబికి వస్తుంది. ఈ లీకేజీని గమనించిన ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే ఇసుక సంచులు వేసి నీటి ఊటలను నిలువరించే ప్రయత్నం చేపట్టారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో 5.71 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.

దీంతో ఒక గేటు పైకి ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజీని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.కాగా మొన్నటివరకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ సమీప రైతులను, గ్రామ ప్రజల్లో ఎకింత ఆందోళ వ్యక్తమవుతుంది. ఇక ఈ వరుస ఘటనపై ప్రతిపక్షాలు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించింది.. అని ఆరోపణలు చేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యారేజీలో 5.71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఒక గేటు ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజీని నిర్మించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ వెలుగుచూడటం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇక ఎన్నికల ముందు కాళేశ్వరం వరుస ఘటనలో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది.

SURESH