TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో కర్ణాటక రైతుల ఆందోళన.. దీని వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందా..?

ఆరు నెలల క్రితం ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ ఆచరణసాధ్యం కాని హామీలు ఇచ్చిందని.. వాటిని నమ్మి జనాలు గెలిపిస్తే.. ఆరు నెలలు గడిచినా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌.. తెలంగాణలో కూడా అలాంటి హామీలే ఇస్తుందని టార్గెట్‌ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 26, 2023 / 08:12 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఊపందుకున్నాయ్. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్‌‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. దీంతో దీనికి ఇప్పుడే చెక్ పెట్టాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసి…అధికారం కైవసం చేసుకోవాలని ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, హస్తం పార్టీని అదే ఫార్ములాతో దెబ్బతీయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

కర్ణాటకలో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తన్నారు. ఆరు నెలల క్రితం ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ ఆచరణసాధ్యం కాని హామీలు ఇచ్చిందని.. వాటిని నమ్మి జనాలు గెలిపిస్తే.. ఆరు నెలలు గడిచినా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌.. తెలంగాణలో కూడా అలాంటి హామీలే ఇస్తుందని టార్గెట్‌ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీలు అమలు కావడం లేదనడానికి అక్కడి రైతుల ఆందోళనలే నిదర్శనమని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొడంగల్, గద్వాలలో కర్ణాటక రైతులు తమకు కరెంటు రావడం లేదని నిరసన తెలిపారు.

ఇక్కడ ఆందోళన ఏంటంటే.. కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి, బీజేపీని గెలిపించాలని డీకే అరుణ ప్రచారం చేశారని, అందుకే వారిని అడిగేందుకు ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. ఐతే ఈ నిరసనల వెనక ఎవరో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. రాజకీయం ఇలానే చేయాలని ఏ పుస్తకంలోనూ లేదు. ఇలాగే చేయాలి అంటే అది రాజకీయమే కాదు. ఏమైనా ఎన్నికల వేళ కర్ణాటక రైతుల ఆందోళనలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఆసక్తికర మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయ్.