Kishan Reddy: బీఆర్ఎస్ మాల్ ప్రాక్టీస్.. ఈసీకి కిషన్ రెడ్డి ఫిర్యాదు..!

బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమిగూడి ఉంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. ఈ అంశంపై స్థానికంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 02:34 PM IST

Kishan Reddy: ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఈసీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. “బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమిగూడి ఉంటున్నారు.

TS POLLING: జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో ఉద్రిక్తత

బీఆర్ఎస్ అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. ఈ అంశంపై స్థానికంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జనగామలో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచడంపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. పోలీసులు కూడా ఈ విషయంలో విఫలమయ్యారు” అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి.. అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని తెలిపారు. ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలన్నారు.