TELANGANA ASSEMBLY ELECTIONS: బీఆర్ఎస్‌కు 85 సీట్లు గ్యారెంటీ.. కరోనా వల్లే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాం: కేటీఆర్

రాష్ట్రంలో ఈసీ బదిలీలను సాధారణ బదిలీలుగా మాత్రమే చూస్తాము. మాకు 85 కంటే సీట్లు తగ్గవని అనుకుంటున్నా. 2018 మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశాం. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయాం. హుజూరాబాద్‌లో BRS గెలుస్తుంది.

  • Written By:
  • Updated On - October 13, 2023 / 07:19 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 85 సీట్లకంటే తక్కువ రావని అనుకుంటున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించారు. రాహుల్ గాంధీ, మోదీ తెలంగాణ వచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు. “మాది సెక్యులర్ ప్రభుత్వం. మైనార్టీలు మా వైపే ఉన్నారు. మైనార్టీల కోసం మేము 9 ఏళ్లుగా పని చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 286 మైనార్టీ హాస్టళ్లు ఏర్పాటు చేశాం.

తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు లేవు. మిషనరీలపై దాడులు లేవు. బిజెపీని, మోడీ, షా లను దేశంలో ఏ నేత కూడా కేసీఆర్‌లా విమర్శించలేదు. జాతీయ రాజకీయాల్లో BRS ప్రబల శక్తిగా ఎదగాలని మా అలోచన. బిజెపి, కాంగ్రెస్‌తో మాకెందుకు..? మాపైనే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం లేదు..? ఓటుకు నోటు కేసును కేంద్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు..? రాష్ట్రంలో ఈసీ బదిలీలను సాధారణ బదిలీలుగా మాత్రమే చూస్తాము. మాకు 85 కంటే సీట్లు తగ్గవని అనుకుంటున్నా. 2018 మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశాం. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయాం. హుజూరాబాద్‌లో BRS గెలుస్తుంది. గజ్వేల్‌లో ఈటెలకు పోటీ చేసే హక్కు ఉంది. ఇవాళ లోకేష్ ట్వీట్ చూసి నాకు మంచిగా అనిపించలేదు. చంద్రబాబుకు భౌతికంగా హాని ఉంది అని లోకేష్ ట్వీట్ చేశారు. అది నిజం అయితే దురదృష్టకరం. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉపవాస దీక్ష నాకు గుర్తుకు వచ్చింది.

నిమ్స్‌లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ కేసీఆర్ ఇంకా ఒక రోజు దీక్షలో ఉంటే కేసీఅర్ చచ్చిపోతారు అని నన్ను భయపెట్టారు. మళ్ళీ చెబుతున్నా ఏపీలోని రెండు పార్టీల వ్యవహారం అది. హైదరాబాద్ అంతా శాంతియుతంగా ఉండాలన్నదే నా తపన. కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో వంద స్థానాల్లో ప్రచారం చేస్తారు. మేనిఫెస్టోలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలకు పెద్దపీట వేస్తాం. పొన్నాల బీఆర్ఎస్‌లో చేరుతానంటే ఇంటికె‌ళ్లి మరీ ఆహ్వానిస్తా” అని వ్యాఖ్యానించారు.