Michoung Typhoon Effect : మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. లక్ష ఎకరాల్లో పంట నష్టం.. లబోదిబోమంటున్న రైతులు

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు తెలంగాణపైనా కూడా తీవ్ర ప్రభావం చూపించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం, గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఏపీలో 8 జిల్లాల్లోని 60 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. చేతికి అందిన పంటలు వరదపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

Web Sites : దేశ వ్యాప్తంగా 100 వెబ్ సైట్స్ పై కేంద్రం వేటు.. ఎందుకో తెలుసా..?

మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దాదాపు 7 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు ఏపీ అధికారులు. లక్ష ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. అలాగే ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి. 90శాతం వరి పంట నష్టమైంది. ఏపుగా పెరిగిన వరి పంట నీట మునగడంతో రంగు మారుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

తుఫాన్ బాపట్ల తీరం దాటినప్పుడు.. ఏపీలో కుండపోతగా వర్షాలు పడ్డాయి. తీర ప్రాంత ఏరియాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వీయడంతో చాలా చోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లూరు నగరంలో అయితే భారీ చెట్లన్నీ నేలకూలాయి. రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో జనం మంచి నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు.

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలోనూ కనిపించింది. ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కళ్ళాల్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని పట్టాలు కప్పుకొని కాపాడుకున్నారు రైతులు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంట తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.