తెలంగాణ స్టేట్ మొత్తం కంప్లీట్‌గా ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాష్ట్రమంతా ప్రచారం జోరుగా సాగుతోంది. పది రోజుల్లో పోలింగ్ జరిగి.. 15 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏదో తేలబోతోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో నిజామాబాద్‌లో ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య చేసుకుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును.. నిజామాబాద్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఓ వ్యక్తి ఉన్నట్టుంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ప్రణాలు తీసుకున్నాడు. నిజామాబాద్ సాయినగర్‌లో ఉండే కన్నయ్య గౌడ్.. నిజామాబాద్ అర్బన్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్నాడు. రీసెంట్‌గానే నామినేషన్ కూడా వేశాడు. ఎన్నికల సంఘం కన్నయ్యకు రోటీమేకర్ గుర్తును కూడా కేటాయించింది.
BJP MANIFESTO: మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు.. మేనిఫెస్టోలో బీజేపీ వరాలు !
పది రోజుల్లో పోలింగ్ ఉన్న టైంలో కన్నయ్య మాత్రం ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణా, అప్పుల వల్లే కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా కొన్ని లోన్ యాప్స్ నుంచి కన్నయ్య లోన్స్ తీసుకున్నాడు. ఆ యాప్ నిర్వాహకుల నుంచి వస్తున్న బెదిరింపులు ఒత్తిళ్ల కారణంగానే కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇదే విషయంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏది ఏమైనా ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీని ఎఫెక్ట్ ఎన్నికల మీద పడే చాన్స్ ఉండటంతో.. అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.