Nani’s political campaign : నాని రాజకీయ ప్రచారం.. ఏ పార్టీ కోసమో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో మీ ఓటు మాకే అంటూ రంగంలోకి దిగాడు నేచురల్ స్టార్ నాని. ఏంటి చూస్తున్నది నాని నేనా..పొలిటికల్ గెటప్పేంటి? ఓట్లు అడగడం ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో మీ ఓటు మాకే అంటూ రంగంలోకి దిగాడు నేచురల్ స్టార్ (Natural Star)  నాని (Nani). ఏంటి చూస్తున్నది నాని నేనా..పొలిటికల్ గెటప్పేంటి? ఓట్లు అడగడం ఏంటి? ఇంతకీ నాని ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడో తెలుసా..

Anil Ravipudi Political Entry : రాజకీయాల్లోకి అనిల్ రావిపూడి..త్వరలో కొత్త పార్టీ !

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో చాలా బిజీగా ఉన్నాడు నాని. దసరా తో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’తో బిజీగా ఉన్నాడు. డిసెంబర్లో విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్ జోరు ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మూవీపై బజ్ పెంచాయి. ఈ మూవీ నుంచి ఒక్కో పాటను విడుదల చేసే ముందు నాని అందుకు తగ్గట్టు ముందు స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేసి ఆ తర్వాత సాంగ్స్ రిలీజ్ చేశాడు. ఎన్నడూ లేని విధంగా ‘హాయ్ నాన్న’ కోసం నాని ప్రమోషనల్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తాజాగా ఎలక్షన్ హీట్ ని కూడా వాడేసుకున్నాడు నాని. అదే మరి ఈ గెటప్ వెనుకున్న అసలు ఉద్దేశం. పొలిటికల్ గెటప్ తో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాని..”ఇది ఎలక్షన్ మూడ్. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమ, ఓటు మాకే అవ్వాలి..మీ ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్” అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు..”నాని అన్న పొలిటికల్ గెటప్ లో అదిరిపోయాడు చివరికి ఎలక్షన్స్ ని కూడా సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నావంటే నువ్వు గ్రేట్ అన్నా అని కామెంట్స్ పెడుతున్నారు.

శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘హాయ్ నాన్న’ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. హాయ్ నాన్నా ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో కూడిన పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇక ఇప్పటికే టీజర్ కంటెంట్ జనాలకు బాగా నచ్చేసింది ఇక రాబోయే ట్రైలర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డా.విజేందర్ రెడ్డి, KS మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ రోల్ లో కనిపించనుంది. హేశం వహబ్ అబ్దుల్ స్వరాలు మ్యూజిక్ లవర్స్ ని ఫిదా చేశాయి. డిసెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్ జోరు పెంచారు టీమ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరగడంతో చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏదేమైనా పొలిటికల్ లీడర్ గెటప్ నానికి అదిరింది. మరి తెలంగాణ ఎన్నికల రిజల్ట్ తర్వాత వచ్చే హాయ్ నాన్న రిజల్ట్ ఏంటో చూద్దాం..