Etala Rajender : ఒంటరి అయిపోయిన ఈటల..!

బీఆర్ఎస్‌లో జరిగిన పరిణామాలతో నిజానికి చాలా ఆప్షన్లు ఉన్నా.. ఈటల బీజేపీ గూటికి చేరుకున్నారు. ఐతే పార్టీలో చేరిన కొత్తలో కాస్త ఇబ్బందిగా కనిపించారు. ఐతే ఢిల్లీ పెద్దల హామీలతో.. మళ్లీ కమలం పార్టీలోనే ఉండిపోయారు ఈటల.

బీఆర్ఎస్‌లో జరిగిన పరిణామాలతో నిజానికి చాలా ఆప్షన్లు ఉన్నా.. ఈటల బీజేపీ గూటికి చేరుకున్నారు. ఐతే పార్టీలో చేరిన కొత్తలో కాస్త ఇబ్బందిగా కనిపించారు. ఐతే ఢిల్లీ పెద్దల హామీలతో.. మళ్లీ కమలం పార్టీలోనే ఉండిపోయారు ఈటల. ఎన్నికల వేళ కమలాన్ని భుజాలపై మోస్తున్నారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు.. కమలం పార్టీ అభ్యర్థుల తరఫున మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఐతే ఇప్పుడు ఈటల ఒంటరి అయినట్లు కనిపిస్తున్నారు. తను నమ్మకం పెట్టుకున్న నేతలు.. తనను నమ్ముకున్న నేతలు ఇద్దరూ.. ఆయనకు దూరం అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈటల రాజేందర్‌కు అత్యంత ఆప్తురాలు, బీసీ నేత తుల ఉమా బీజేపీకి రాజీనామా చేశారు. ముందు ఆమె ఆమెకు వేములవాడ టికెట్ కేటాయించింది. చివరి నిమిషంలో ఆమెను కాదని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌కు టికెట్‌తో పాటు బీ ఫామ్ ఇచ్చింది. దీంతో ఈటలతో పాటు తుల ఉమా షాక్ అయ్యారు. తనకు టికెట్ రాకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తన అనుచరులతో భేటీ తర్వాత బీజేపీ ప్రాథమిక సభ్యత్వానిక రాజీనామా చేశారు.

కేసీఆర్‌ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో బీజేపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఉమ. కమలం పార్టీపై తీవ్ర ఆరోపణల తర్వాత.. తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇలా ఈటల వెంట ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా ఆయనకు పార్టీకి దూరం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా.. ఈటలను కాదని బీజేపీకి బై బై చెప్పారు. నిజానికి ఈటల ఎక్కడ కనిపించినా.. అక్కడ ఏనుగు రవీందర్‌ రెడ్డి కనిపించేవారు. రాజకీయానికి మించి వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఉంది. అలాంటిది ఈటలను, బీజేపీని కాదనుకున్న ఏనుగు రవీందర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయన హ్యాండ్ ఇచ్చిన కొద్దిరోజులకే.. ఈటల మరో ఫాలోవర్‌ తుల ఉమా కూడా బీజేపీకి బై బై చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. ఇద్దరు ప్రధాన అనుచరులు దూరం కావడంతో.. ఒకరకంగా ఈటల ఒంటరి అయ్యారనే ప్రచారం సాగుతోంది.