తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం డ్యాం ప్రాంతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు.
ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు 1500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
YS Jagan : ఆంధ్రలోనూ మార్పు తప్పదా ?
నాగార్జునసాగర్ దగ్గర హైటెన్షన్ కొనసాగుతుంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీస్ పహారా కొనసాగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్‍మెంట్ బోర్డు నిబంధనలను ఏపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని తెలంగాణ ఆరోపిస్తోంది.
నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీ పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల అనుమతులు లేకుండా ఆంధ్రాపోలీసులు డ్యాంపైకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అనుమతి లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు కుడి కాలువ నుంచి నీటిని వదిలారని తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐజీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఏపీకి కుటి కాలువ నుండి నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి నీటిని తాగునీటి అవసరాల కోసమే విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం 1500 పోలీసులు మోహరించారు. ఇటువైపు డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు 1000 మంది దాకా చేరుకున్నారు. ఐజీస్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం సాగర్ జలాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఏపీకి నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటి విడుదల ఇలాగే కొనసాగుతే.. నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.