Sachin Pilot : తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడతారు.. సచిన్ పైలట్

రాజస్థాన్ ఎమ్మెల్యే ,ఏఐసీసీ జాతీయ నాయకులు.. సచిన్ పైలట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయ్యాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పై ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే ,ప్రియాంకా గాంధీ ల పర్యటనకు మంచి స్పందన వస్తుంది.

రాజస్థాన్ ఎమ్మెల్యే ,ఏఐసీసీ జాతీయ నాయకులు.. సచిన్ పైలట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయ్యాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పై ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే ,ప్రియాంకా గాంధీ ల పర్యటనకు మంచి స్పందన వస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఛత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ లతో పాటు తెలంగాణ లోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30 వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేయాలి. కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీకి, నాయకులకు క్రెడిబిలిటీ లేదు. ఉద్యోగం ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక కాంగ్రెస్ విజయం పొందింది. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే రిపిట్ అవుతుంది.

KCR TOUGH FIGHT: టఫ్ ఫైట్.. కేసీఆర్‌కి టఫ్ ఫైట్ ఎక్కడ..? రెండు చోట్లా బీఆర్ఎస్ శ్రేణులు అలెర్ట్..

ఓట్ ఫర్ చేంజ్..

మార్పు కోసం ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్ లో 5 సంవత్సరాల కోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి మరి రాజస్థాన్ లో మల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాజస్థాన్ కి ఎలాంటి సహకారం ఇవ్వలేదు.. అయిన ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీ కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇక సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ లో ఉండదు. సీఎం అభ్యర్తి ఎవరన్నది ఏఐసీసీ అధిష్టానం సీఎం సెలెక్ట్ చేస్తది.