ASSEMBLY ELECTIONS: నిద్రపోయింది చాలు.. వచ్చి ఓటెయ్‌.. హైదరాబాద్‌లో మళ్లీ అదే తీరు..

పోలింగ్ ప్రారంభం అయిన మొదటి అరగంట కొద్దిసేపు కాస్త జనంతో హడావిడిగా కనిపించినా.. తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయ్. వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఓటు వేసి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 02:41 PM IST

ASSEMBLY ELECTIONS: చదివేస్తే ఉన్న మతి పోయిందని ఓ సామెత ఉంది తెలంగాణలో ! అది నిజమే అనిపిస్తుంది తెలంగాణలో పోలింగ్ తీరు చూస్తుంటే. రూరల్‌ ఏరియాల్లో పోలింగ్‌ పర్సంటేజీ భారీగా ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదవుతోంది. పోలింగ్ ప్రారంభం అయిన మొదటి అరగంట కొద్దిసేపు కాస్త జనంతో హడావిడిగా కనిపించినా.. తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయ్. వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఓటు వేసి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

Kishan Reddy: బీఆర్ఎస్ మాల్ ప్రాక్టీస్.. ఈసీకి కిషన్ రెడ్డి ఫిర్యాదు..!

తొలి రెండు గంటల్లో.. హైదరాబాద్‌లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం, సనత్ నగర్‌లో 1.2 శాతం, అత్యధికంగా కూకట్‌పల్లిలో 1.5 శాతం పోలింగ్ నమోదయింది. ఎంత చెప్పినా.. అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించినా, సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేసినా హైదరాబాదీలు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. పోలింగ్ డే అంటే.. ఇంకా హాలీడేలాగా చూసే కల్చర్ మారలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. టెక్కీలు, చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం సరిగ్గా కనిపించడం లేదు అంటే.. అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. దీంతో ఈ తీరుపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

పోలింగ్ డే అంటే హాలీడ్‌ కాదు బ్రదర్‌.. భవిష్యత్‌ను డిసైడ్ చేసే రోజు.. ఇంక మారవా.. నీ బతుకులను మార్చుకోవా.. ముందుకు రావా.. నిద్రపోయింది చాలు.. ఇకనైనా లేచి పోలింగ్ స్టేషన్ వైపు అడుగులు వెయ్‌.. అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.