పఠాన్‌చెరు (Patan Cheru ) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మంటపెట్టింది. ఇక్కడి నుంచి నీలం మధు (Neelam Madhu) ముదిరాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా భగ్గుమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పార్టీ కోసం ముందు నుంచీ కష్టపడ్డవారిని పక్కనపెట్టి.. కొత్తగా వచ్చినవాళ్లకు ఎలా టికెట్ ఇస్తారంటూ నిలదీశారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాటా శ్రీనివాస్‌కు టికెట్ ఇప్పించేందు కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ ముందు నుంచీ ప్రయత్నించారు.
పఠాన్‌చెరుతో పాటు, నారాయణ్‌ఖేడ్ టికెట్లు తన అనుచరులకు ఇవ్వాలంటూ ముందు నుంచి కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు. కానీ రేవంత్ రెడ్డి సూచనతో రెండు స్థానాల్లో కొత్త వ్యక్తులు తెరమీదకు వచ్చారు. రీసెంట్‌గా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు పఠాన్‌చెరు నుంచి టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా మంట పుట్టింది. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో రాజనర్సింహా (Damodara Narasimha) ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా కాలం నుంచి రేవంత్ డామినేషన్ ఎక్కువైంది చాలా మంది సీనయర్ల మదిలో ఉన్న మాట. ఇప్పుడు బయటికి చెప్పకపోయినా రాజనరసింహ ఫీలింగ్ కూడా అదే అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు తాను చెప్పిన వ్యక్తులకు కాకుండా కొత్త వ్యక్తులకు టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు.
దీంతో హైకమాండ్ రంగంలోకి దిగి రాజనర్సింహాను బుజ్జగించే కార్యక్రమం మొదలె పెట్టింది. స్వయంగా రాజనరసింహకు ఏఐసీసీ నేతలు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఇంటిముందు ధర్నా చేయడం పార్టీకి మంచిది కాదని.. వెంటనే ఆందోళనలు ఆపేయాలని సూచించారట ఏఐసీసీ నేతలు. కానీ పఠాన్‌చెరు అభ్యర్థిని వెంటనే మారిస్తే తప్ప తాను ఆందోళన ఆపేది లేదనే పట్టుదలతో రాజనరసింహ ఉన్నట్టు తెలుస్తోంది. అదిష్టానం దిగిరాకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో కూడా రాజనరసింహ ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నీలం మధుకు సపోర్ట్ చేసేది లేదంటూ చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఇప్పుడు సిచ్యువేష్ హాట్ హాట్‌గా ఉంది.