అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజం అయింది. కామారెడ్డిలో కేసీఆర్ (KCR) కు పోటీగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బరిలో దిగుతున్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ.. నిజామాబాద్ అర్బన్ షిఫ్ట్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడి (TPCC President) గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ జోష్‌కు కర్ణాటక విజయం మరింత యాడ్ అయింది. దీనికితోడు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కూడా జనాల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇక అటు కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాదు.. కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని పదేపదే అంటున్న రేవంత్.. కామారెడ్డి నుంచి ఆయన మీద పోటీకి సిద్ధం అయ్యారు. భవిష్యత్ సంగతి పక్కనపెడితే.. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కూడా సీఎం క్యాండిడేట్.
TELANGANA CONGRESS: నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు..
దీంతో ఇద్దరు సీఎం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఉండడంతో కామారెడ్డి రాజకీయం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఐతే ప్రస్తుత పరిణామాల మధ్య జనం మనసులో ఏముంది.. ఓటర్ తీర్పు ఎటు వైపు అనేది క్లియర్‌గా చెప్పలేని పరిస్థితి. కామారెడ్డి రాజకీయం చూస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు సమానంగా ఉన్నాయి. కామారెడ్డిలో ప్రస్తుతం గంప గోవర్ధన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో గంపగోవర్ధన్‌కు 68వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ (Shabbir Ali) కి 63వేల ఓట్లు వచ్చాయి. అంటే.. ఐదు వేల ఓట్ల తేడాతో మాత్రమే గంప గోవర్ధన్ విజయం సాధించారు. ఐతే ఈసారి సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయబోతుండగా.. కాంగ్రెస్ నుంచి రేవంత్ బరిలో ఉండబోతున్నారు. రెండు బలమైన పార్టీలే.. దీంతో ఇక్కడ బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఓటర్లు కీలకంగా ఉన్నారు.
Damodara Narasimha : మంటపెట్టిన పఠాన్‌చెరు.. కాంగ్రెస్‌కు రాజనరసింహ రాజీనామా !?
గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఇక్కడ 15 వేల ఓట్లు వచ్చాయి. ఐతే ఆ ఓట్లు ఎటు వెళ్తాయ్ అన్న దాని మీదే.. ఫలితం ఆధారపడి ఉంటుంది. కామారెడ్డిలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు కనిపించాయ్. దీంతో కాంగ్రెస్ నేతలు దీమాగా కనిపిస్తున్నారు. ఇక అటు నిరుద్యోగులు, మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లితే రేవంత్ రెడ్డి విజయం సాధించే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐతే ఇవన్నీ అంచనాలు మాత్రమే.. ఏం జరుగుతుంది అన్నది డిసెంబర్ 3నే తేలుతుంది.