తెలంగాణ ప్రజల తీర్పు తేలిపోయింది. పదేళ్ల కారు ప్రయాణం తరువాత హస్తానికి అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. తెలంగాణకు కొత్త సీఎం ఎవరు అవుతారు అనే విషయంపై మీటింగ్ నిర్వహించినా.. ఫైనల్‌గా రేవంత్ రెడ్డి పేరే తెరమీదకు వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో రేవంత్ రెడ్డి పోషించిన పాత్రకు ఇప్పుడున్న నేతలు ఎవరూ మ్యాచ్ అవ్వలేరు. అటు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో కూడా రేవంత్ రెడ్డే ఉన్నట్టు కాంగ్రెస్‌లో ఇంటర్నల్ టాక్ నడుస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానానికి చెక్ పెట్టి, అధికారం నుంచి దించారు రేవంత్ రెడ్డి. ప్రతీ మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది అంటారు.
MLA : ఒకప్పుడు పేపర్ బాయ్ ఇప్పుడు ఎమ్మెల్యే..
అలాగే రేవంత్ రెడ్డి ప్రతీ విజయం వెనక కూడా ఆయన భార్య గీతారెడ్డి ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే రేవంత్‌ది లవ్ మ్యారేజ్. తెలంగాణకు కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్న ఈ తరుణంలో ఆయన లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంటర్ చదువుతున్న టైంలో రేవంత్ రెడ్డికి గీతారెడ్డితో పరిచయం ఏర్పడిందట. మొదటిసారి వీళ్లు నాగార్జున్ సాగర్‌లో కలుసుకున్నారట. మొదటి చూపులోనే గీతారెడ్డి నచ్చడంతో.. ఆమెతో స్నేహం పెంచుకున్నారట రేవంత్ రెడ్డి. కొద్ది రోజులకే వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. మొదట తానే ఇష్టపడ్డాడు కాబట్టి.. రేవంత్ రెడ్డే గీతారెడ్డికి ప్రపోజ్ చేశాడట. రేవంత్ రెడ్డి ముక్కుసూటితనం, డైనమిజం నచ్చిన గీతారెడ్డి వెంటనే ఆయనకు ఓకే చెప్పారట. కొంత కాలం ప్రేమించుకున్న తరువాత ఇంట్లో వాళ్లకు విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. లవ్‌మ్యారేజ్‌కు ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని తెలిసినా.. పట్టుబట్టి ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించుకుని 1992లో పెళ్లి చేసుకున్నారట.
అప్పటికే రాజకీయాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి పొలిటికల్‌గా కూడా గీతా రెడ్డి సపోర్ట్‌గా నిలిచారు. రేవంత్ అరెస్ట్ సమయాల్లో కూడా ధైర్యంగా నిలబడి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రేవంత్‌కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో గీతారెడ్డిదే ప్రముఖ పాత్ర అని అంతా చెప్తుంటారు. అలాంటి సపోర్టివ్ భార్య ఉంది కాబట్టే రేవంత్ వరుస విజయాలతో దూసుకెళ్లి ఇప్పుడు సీఎం అయ్యే స్థాయికి వచ్చాడని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి కూడా తన భార్య ప్రేమకు దాసుడే అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.