కేసీఆర్ కొంపముంచిన హరీష్ రావు..
అనుకున్నంతా అయింది.. కావాలని చేశాడో.. అనుకోకుండా చేసాడో హరీష్ రావు కేసీఆర్ కొంప ముంచాడు. రైతుబంధు నిధుల విడుదలపై హరీష్ రావు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఇప్పుడు ఈసీ ఆ స్కీమ్ నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. హరీష్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం వల్లే రైతుబంధు విడుదల అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ తన కన్ను తానే పొడుచుకున్నట్టు అయింది.
Rythu Bandhu : ఎన్నికల్లో రైతు బంధుతో ఓట్లు దండుకోవాలని కేసీఆర్ ఆశ.. రేవంత్, భట్టి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ వేవ్ నడుస్తోందన్న టాక్ తో బీఆర్ఎస్ శిబిరంలో కొన్నాళ్ళుగా అలజడి మొదలైంది. అయినా సరే.. కేసీఆర్ మీద ఆ పార్టీ శ్రేణుల్లో ఏదో ఒక ఆశ. చివరి నిమిషంలో ఏదో ఒక మాయ చేస్తాడు.. పార్టీని గట్టెక్కిస్తాడు అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ కేడర్ గట్టి నమ్మకం పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కెసిఆర్ రైతుబంధు డబ్బు రైతుల అకౌంట్లో వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆల్మోస్ట్ పర్మిషన్ తెచ్చుకున్నాడు. పోలింగ్ తేదీకి సరిగ్గా రెండు రోజుల ముందు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 7 వేల కోట్ల రూపాయలు వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంటే 28వ తేదీ మంగళవారం నాడు అకౌంట్ లో జమకు అంతా సిద్ధం చేశారు. అసలు బ్యాంకులకు సెలవులు రాకపోతే.. శనివారం రోజే అమౌంట్ పడేవి. దాంతో ఈసీ పునరాలోచించుకునే అవకాశం కూడా ఉండేది కాదు.
Rythu Bandhu: బీఆర్ఎస్ సర్కార్ కి షాక్.. రైతు బంధు పంపిణీ నిలిపివేత.. ఈసీ అనుమతులు వెనక్కి
ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేయడానికి ఈసీ మొదట ఒప్పుకోవడంతోనే కాంగ్రెస్ కంగుతుంది. బీఆర్ఎస్, బీజెపి ఫ్రెండ్షిప్ మరోసారి ఇలా బయటపడిందని విమర్శించింది. అలాగని రైతులకు డబ్బులు ఇవ్వొద్దని డైరెక్ట్ గా చెప్పే పరిస్థితి కూడా కాదు. ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా భీతిల్లిపోయింది. రైతుల ఎకౌంట్లో రైతు బందు డబ్బులు పడితే.. బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అందరూ భావించారు. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ ఇదే టైమ్ లో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. కేసీఆర్ కొంపముంచుతూ ప్రచార సభల్లో రైతుబంధు మీద ప్రకటన చేశారు. సోమవారం సెలవు కాబట్టి.. మంగళవారం కల్లా మీ ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు పడిపోతాయి. మీరు పొద్దుగాల టీ తాగే టైమ్ కి టింగ్ టింగ్ మని మీ మొబైల్ ఫోన్లు మోగుతయ్.. అని గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ అడ్డుకోవాలని చూసినా.. మేం డబ్బులు ఇస్తున్నామని బీరాలు పోయారు. సరిగ్గా ఈ కామెంట్స్ తోనే ఇప్పుడు రైతు బంధు నిధులు ఆగిపోయాయి.
రైతు బంధు నిధుల గురించి బహిరంగ సభల్లో ప్రస్తావించడం.. దాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడాన్ని సాకుగా చూపించి.. రైతుబంధు నిధుల జారీ వెంటనే నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కర్మ సరిలేనప్పుడు తాడే పాముగా మారి కరిచినట్లు బిఆర్ఎస్ టైం బాగోలేదు.. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రివర్స్ అవుతూనే ఉన్నాయి. అంతా బాగుంది అనుకున్న టైమ్ లోనే.. చివరికి హరీష్ రావు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్దదెబ్బ తగిలింది. రైతుబంధు డబ్బులు పడగానే ఓటర్లంతా టర్న్ అయిపోతారనీ.. ఇక తమ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని బీఆర్ఎస్ కలలు గన్నది. కానీ ఇప్పుడు ఇలా కథ అడ్డం తిరగడంతో.. బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో పడింది. హరీష్ రావు వల్లే ఇలా జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థులంతా మనసులో తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వల్లే ఆగింది అని ప్రచారం చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని లోలోపల కుమిలిపోతున్నారు.