వైఎస్సార్ ముద్దుల కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయా..? తన ముద్దుల కొడుకు లవ్ మ్యారేజీకి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? టీడీపీ అధినేత చంద్రబాబు దూరం చుట్టంతో షర్మిల వియ్యం అందబోతున్నారా..? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తల్లో నిజమెంత..?
వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఆమె కొడుకు రాజారెడ్డి త్వరలోనే లవ్ మ్యారేజ్ చే పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.. రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది.. ఇంతలో.. ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట్లో ప్రత్యక్షమై వైరల్ అవుతోంది.. దీంతో.. వీరిద్దరి లవ్ స్టోరీ.. మ్యారేజీ వరకు వచ్చిందంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు.
రాజారెడ్డి చేసుకునే అమ్మాయిపేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా రాజారెడ్డి లాగానే అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తాత అట్లూరి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఛట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకుడు. రెండు కూడా ఉన్నత కుటుంబాలే కావడంతో రాజారెడ్డి, ప్రియ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. మరో వైపు షర్మిల, అనిల్‌ది కూడా ప్రేమ వివాహమే కాబట్టి.. తమ ముద్దుల కొడుకు పెళ్లికి అడ్డు చెప్పకుండా ఓకే అనేశారు.
అయితే.. ఇక్కడే ఓ ఆసక్తికరమైన మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది.. ఆ మధ్య జగన్ పెద్ద కూతురును రాజారెడ్డికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదుగాని అది ప్రచారానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు జగన్, షర్మిల మధ్య మాటల్లేవ్.. ఇప్పుడు షర్మిల ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోయే ప్రియ కుటుంబానిది కమ్మ సామాజిక వర్గం.. దట్ టూ.. చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు దూరం చట్టం అని తెలుస్తోంది.. మరి అదే నిజమైతే.. జగన్‌కు షర్మిల గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.. మొత్తానికి ఏది ఏమైనా షర్మిల కొడుకు, కాబోయే కోడలి ఫొటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి.