Sonia Gandhi : హైదరాబాదులో సెటిల్ కానున్న సోనియా గాంధీ.. ఇకపై నెలలో 15 రోజులు ఇక్కడే..!

యూపీఏ మాజీ చైర్మన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీని ఇప్పటికీ అన్నీ తానే అయి నడిపిస్తున్న సోనియాగాంధీ త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొన్నేళ్ళుగా సోనియా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆమెకి న్యూయార్క్ లో ట్రీట్మెంట్ కూడా జరిగింది. క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ శారీరకంగా చాలా సమస్యలు ఉన్నాయి సోనియాకి.

యూపీఏ మాజీ చైర్మన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీని ఇప్పటికీ అన్నీ తానే అయి నడిపిస్తున్న సోనియాగాంధీ త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొన్నేళ్ళుగా సోనియా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆమెకి న్యూయార్క్ లో ట్రీట్మెంట్ కూడా జరిగింది. క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ శారీరకంగా చాలా సమస్యలు ఉన్నాయి సోనియాకి. 77 ఏళ్ల సోనియాకు ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య కూడా ఉంది. ఆమె ఢిల్లీ లాంటి అతి భయంకరమైన కాలుష్య నగరంలో ఉండడం ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదని పర్సనల్ డాక్టర్స్ సూచిస్తున్నారు. న్యూయార్క్ లో ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు. ఢిల్లీ కాలుష్యం ఇప్పటికే అన్ని పరిమితులు దాటిపోయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ముద్ర పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఢిల్లీలో ఉంటే పొల్యూషన్ వల్ల వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉందనీ.. ఏ రకంగానూ శ్రేయస్కరం కాదని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే సోనియాని హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచిస్తున్నారు. బెంగళూరుతో పోల్చినప్పుడు హైదరాబాద్ అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది.

బెంగళూరు కంటే కాలుష్యం కూడా హైదరాబాదులో తక్కువ. ముఖ్యంగా నగర శివారులో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అలాగే నగర.. ఉష్ణోగ్రతలు సమంగా ఉంటాయి. భయంకరమైన వేసవిలో కూడా ఎండ 45 డిగ్రీల సెంటిగ్రేడ్ మించదు. సిటీకి చుట్టుపక్కల చాలా ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది ఉండదు. అన్నిటికీ మించి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మొదటి నుంచి తెలంగాణపై సోనియాకు కాస్త ప్రత్యేక అభిమానం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రియాంక, రాహుల్ సోనియాగాంధీని హైదరాబాదులో ఉంచితేనే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. మొదట హైదరాబాదులో కాస్త సెటిల్ అయితే, ఆరోగ్యం కుదురుపడితే అవసరమైనప్పుడు ఢిల్లీకి వెళ్లి రావచ్చని అభిప్రాయంతో కూడా సోనియా కుటుంబం ఉంది. దీనికి సంబంధించి స్థానిక అగ్రనేతలతో చర్చలు కూడా జరిగాయి. సోనియా సెక్యూరిటీకి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చర్చించారు. అలాగే అందుబాటులో ఉండే డాక్టర్లు ,ఇతర అవసరాల గురించి కూడా పరిశీలించారు. ఇక రేపో మాపో సోనియా కోసం ఒక ఇల్లు వెతకడం… కాంగ్రెస్ అధినేత్రిని హైదరాబాద్ తరలించడం జరగనుంది.