Telangana BJP : నాలుగో జాబితాపై బీజేపీ కసరత్తు.. ప్రచారంలో వెనుకపడ్డ జాతీయ పార్టీలు..!

తెలంగాణ ఎన్నికలు జరిగేందుకు ఎన్నో రోజులు లేవు.. రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికి అధికార పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్ లు కూడా ఇచ్చారు గులాబీ బాస్. ఇక ఎవరికి వారు తమ తమ ప్రచారంలో సోషల్ మీడియా ను ఉపయోగించుకోని ముందుకు సాగుతు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ లు నత్త నడకలా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. వచ్చిన వారు ప్రచారం మొదలు పెడుతున్నారు. రెండు జాతీయ పార్టీ అయినప్పటికి ప్రచారంలో మాత్రం రెండు పార్టీ వెనకపడ్డాయి అని అభిప్రయాపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ ( Telangana Election ) ఎన్నికలు జరిగేందుకు ఎన్నో రోజులు లేవు.. రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికి అధికార పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్ లు కూడా ఇచ్చారు గులాబీ బాస్. ఇక ఎవరికి వారు తమ తమ ప్రచారంలో సోషల్ మీడియా ను ఉపయోగించుకోని ముందుకు సాగుతు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ లు నత్త నడకలా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. వచ్చిన వారు ప్రచారం మొదలు పెడుతున్నారు. రెండు జాతీయ పార్టీ అయినప్పటికి ప్రచారంలో మాత్రం రెండు పార్టీ వెనకపడ్డాయి అని అభిప్రయాపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ ( Telangana BJP ) మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాల్లో 88 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించింది బీజేపీ అదిష్ఠణం. ఇక మిగిలిన 31 సీట్లకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించే అంశంపై బీజేపీ హైకంమాండ్ తీవ్ర కసరత్తు చేస్తుంది. మరో వైపు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇక ఈనెల 10 వరకు నామినేషన్ గడువు స్వీకరణ జరుగుతుంది. ఈ లోపు మిగిత అభ్యర్థుల జాబితా ను పూర్తి చేసేందుకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కీలక నేతలు, అసంతృత్తిలో ఉన్న నేతలకు గాలం వేసి లాగేందుకు ప్రయాత్రిస్తున్నట్లు పార్టీ వర్గాలు చేప్తున్నా మాట.

ఇది ఇలా ఉండగా పార్టీలోకి వచ్చే వారిని.. చేర్చుకుంటూ నాలుగవ జాబితాను విడుదల చేసేందుకు అధిష్టానం పెద్దలతో చర్చించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటుగా ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఇదే జాబితాలో తెలంగాణలో పోటీ చేయబోతున్న మరో పొత్తు పార్టీ.. జనసేనకు కొన్ని సీట్లు కేటాయింపు పై క్లారీటి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు పొత్తు కుదిరితే జనసేనకు 8 – 10 సీట్లు కేటాయించబోతున్నట్లు వస్తున్న వార్తలకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాలో మరో మూడు రోజుల్లో వచ్చేస్తుంది.

ఏది ఏమైనా.. తెలంగాణలో ఎన్నికలు జరగుతున్నట్లు ఒక్క బీఆర్ఎస్ పార్టీలో తప్ప మరే పార్టీలో ఆ సందడే కనిపించట్లేదు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస కారు వేగాన్ని. జాతీయ పార్టీలు ఏ మాత్రం అందుకోలేవకపోతున్నాయి. ఓ వైపు కేసీఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తన స్టైల్ లో ప్రాచారాన్ని ముందుకు సాగిస్తున్నారు గులాబీ బాస్.

SURESH