Telangana assembly elections : సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల పర్యటన షెడ్యూల్ .. 16 రోజుల్లో.. 54 సభలు

ఈ ప్రచారం జరుగుతునే కేసీఆర్ రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రెండో షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసి.. నిన్న తన సెంటిమెంట్ దైవం అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోని నామినేషన్ పత్రాలకు వెంకన్న పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ( Telangana assembly elections )  రసవంతంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఎన్నికల ప్రచారం కనిపిస్తుంది. రోజుకు మూడు సభలు చొప్పున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు గులాబీ దళపతి. ఇక ఇప్పటి వరకు 17 రోజులు 42 సభలు నిర్వహిస్తు ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు గులాబీ బాస్.

ఈ ప్రచారం జరుగుతునే కేసీఆర్ ( CM KCR )  రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రెండో షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసి.. నిన్న తన సెంటిమెంట్ దైవం అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోని నామినేషన్ పత్రాలకు వెంకన్న పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు సీఎం కేసీఆర్. ఇక ఈ నెల 25న హైదరాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో భారీ బహిరంగా సభ నిర్వహించి జంటనగరాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఈ నెల 28న చివరి సభ కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహించి ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు.

16 రోజుల్లో.. 54 సభలు.. 

  • 13-11-2023 – దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట
  • 14-11-2023 పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
  • 15-11-2023 బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
  • 16-11-2023 ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
  • 17-11-2023 కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల
  • 18-11-2023 చేర్యాల
  • 19-11-2023 అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి
  • 20-11-2023 మానకొండూర్, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ
  • 21-11-2023 మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
  • 22-11-2023 తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి
  • 23-11-2023 మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు.
  • 24-11-2023 మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
  • 25-11-2023 హైదరాబాద్:
  • 26-11-2023 ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
  • 27-11-2023 షాద్ నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి
  • 28-11-2023 వరంగల్, గజ్వేల్

నవంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీని కేంద్ర ఎన్నిక సంస్థ ప్రటించింది. నవంబర్ 30 ను తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.

SURESH