TELANGANA CONGRESS: లక్కీ చాన్స్‌ కొట్టేసిన నీలం మధు.. పటాన్‌చెరు టిక్కెట్ గ్యారెంటీనా..?

పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకు.. బీఆర్ఎస్ నుంటి టికెట్‌ దక్కలేదు. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు మధు. అప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడ్డాయ్. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీతో సహా అన్ని పార్టీలు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ్.

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 03:36 PM IST

TELANGANA CONGRESS: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోందిప్పుడు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. జరిగిన పరిణామం ఎలాంటి మలుపులకు కారణం అవుతుందో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి. పార్టీలు ఒక్కో లిస్ట్ అనౌన్స్ చేస్తున్న కొద్దీ ఈ మలుపులు మరింత వేగంగా తిరుగుతున్నాయ్. బీఆర్ఎస్‌ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు.

అసంతృప్తులు అంతా వరుసపెట్టి కారు దిగేశారు. ఆ లిస్ట్‌లో కీలకంగా చెప్పుకోవాల్సింది నీలం మధు గురించి! పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకు.. బీఆర్ఎస్ నుంటి టికెట్‌ దక్కలేదు. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు మధు. అప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడ్డాయ్. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీతో సహా అన్ని పార్టీలు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ్. దీంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే టెన్షన్‌ కనిపించింది. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తాను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని తెగేసి చెప్పిన మధు.. మంచి అవకాశం కోసం ఎదురుచూశారు. దీంతో చాలాకాలం సస్పెన్స్‌ తర్వాత.. మొత్తానికి క్లారిటీ వచ్చింది. నీలం మధు లక్కీ చాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు పటాన్‌చెరు టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

టికెట్ హామీతోనే మధు హస్తం గూటికి చేరుకున్నారని తెలుస్తోంది. ఐతే ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మద్దతుతో టిక్కెట్ తనకే అంటూ ధీమాగా ఉన్నారు. దీంతో సెకండ్‌ లిస్ట్‌లో ఎవరి పేరు ఉండబోతుంది.. ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.