TELANGANA BJP: పార్టీ నుంచి వెళ్లే వాళ్లే తప్ప వచ్చే వాళ్లేరి..? తెలంగాణ బీజేపీలో అయోమయం..!

క్షేత్రస్థాయి కార్యకర్తల సంగతి వదిలేస్తే.. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలపై పట్టున్న వారిలో ఒక్కరు కూడా లేరు. చేరికల కోసం ఓ కమిటీ పెట్టి.. ఆ కమిటీకి ఈటలను చైర్మన్‌గా కూడా పెట్టారు. ఐనా సరే కమలం పార్టీలోకి చేరికలు కనిపించడం లేదు.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 06:07 PM IST

TELANGANA BJP: ఎన్నికల వేళ తెలంగాణలో నాయకుల జంపింగ్‌లు తారస్థాయికి చేరుతున్నాయ్. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త‌ర్వాత‌.. పార్టీల స‌మీక‌ర‌ణ‌ాలు మారుతున్నాయ్. దీంతో అదే రేంజ్‌లో చేరికలు కూడా పుంజుకుంటున్నాయ్. ఐతే ఈ చేరిక‌లు, కూడిక‌లు కేవ‌లం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మాత్రమే ప‌రిమితం అవుతున్నాయ్. అసంతృప్త నేత‌లు, టికెట్లు ఆశిస్తున్నవారు.. కొన్ని పార్టీల‌కు భ‌విత‌వ్యం లేద‌ని భావిస్తున్న వారు బలమైన పార్టీలోకి జంపింగులు షురూ చేశారు. రీసెంట్‌గా కోమటిరెడ్డి, వివేక్‌ చేరిక వరకు అదే కనిపిస్తోంది.

అసంతృప్తులంతా.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు. రెండు పార్టీలోలనూ చేరికలు జోరుగా సాగుతున్నాయ్. అయితే అటు, లేక‌పోతే ఇటు అన్న ట్టుగానే జంపింగ్‌లు కనిపిస్తున్నాయ్. ఎవ‌రూ కూడా ఈ రెండు పార్టీల‌ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. దీంతో బీజేపీ ప్రస్తుతం చిక్కుల్లో ఉంది. చేరికలు లేకపోతే లేకపోయాయ్.. ఉన్నవాళ్లు కూడా కమలం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బీజేపీకి ఔట్‌గోయింగ్‌ తప్ప.. ఇన్‌కమింగ్‌ లేదు అన్నట్లుగా తయారయింది పరిస్థితి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వదిలి పోతున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల సంగతి వదిలేస్తే.. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలపై పట్టున్న వారిలో ఒక్కరు కూడా లేరు. చేరికల కోసం ఓ కమిటీ పెట్టి.. ఆ కమిటీకి ఈటలను చైర్మన్‌గా కూడా పెట్టారు. ఐనా సరే కమలం పార్టీలోకి చేరికలు కనిపించడం లేదు. ఒక్క నేతను చేర్చుకునే ప్రయత్నం ఈటల చేయడం లేదు. వరుసగా బీజేపీకి రాజీనామాలు కనిపిస్తున్న వేళ.. కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. బీజేపీని నేత‌లు న‌మ్మడం లేదా అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. నిజానికి బండి సంజ‌య్ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు.. అంతో ఇంతో ఊపు క‌నిపించింది. ప‌లు పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప్రయ‌త్నం చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌ను పార్టీ నుంచి త‌ప్పించారు. కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్‌రెడ్డిని పార్టీ చీఫ్‌ను చేశారు. ఆ తర్వాత పార్టీ చేరిక‌లు తగ్గిపోయాయ్. వెళ్లే వాళ్లంతా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వైపు చూస్తున్నారే తప్ప.. బీజేపీ వైపు చూస్తున్న నాయ‌కులు ఒక్కరు కూడా లేరు. దీంతో బీజేపీ ఏం పాపం చేసింద‌నే కామెంట్లు చేస్తున్నారు. పార్టీపై న‌మ్మకం అయినా పోయి ఉండాలి.. లేదంటే పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని క‌న్ఫార్మ్ చేసుకునైనా ఉండాల‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.