తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేస్తుండటంతో.. ఇటు కొడంగల్ తో పాటు.. అటు ఏపీలోని భీమవరంలోనూ భారీగా సంబరాలు జరిగాయి. క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు. అదేంటి ఏపీలోని భీమవరానికి రేవంత్ ఉన్న లింకేంటి.. అక్కడ పటాకులు కాల్చడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Anumala Revanth Reddy : రేవంత్ అనే నేను..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగానే.. ఏపీలోని భీమవరంలో సంబరాలు జరిగాయి. రేవంత్ కి భీమవరానికి ఉన్న సంబంధం ఏంటని అందరూ సెర్చ్ చేసే పనిలో పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం రేవంత్ రెడ్డి వియ్యంకుడి ఊరు. అక్కడి వ్యాపారవేత్త గొలుగూరి వెంకటరెడ్డి కొడుకుని.. రేవంత్ కుమార్తె నైమిషా రెడ్డిని ఇచ్చి 2015లో పెళ్ళి చేశారు. ఈ పెళ్ళి జరిగిన తర్వాత రెండుసార్లు భీమవరం కూడా వెళ్ళొచ్చారు రేవంత్. వెంకటరెడ్డికి భీమవరంతో పాటు హైదరాబాద్ లో కూడా ఆటో మొబైల్, ఫైనాన్స్ లాంటి వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఏరియాలో రేవంత్ రెడ్డికి పరిచయాలు కూడా ఉన్నాయి. ఓసారి సంక్రాంతి వేడుకలను చూసేందుకు ఆహ్వానిస్తే రేవంత్ వెళ్ళొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన డిసెంబర్ 3న కూడా భీమవరంలో పెద్ద సంఖ్యలో అభిమానులు సంబరాలు చేశారు. స్వీట్స్ పంచి, క్రాకర్స్ కాల్చారు.
ఇక సీఎంగా రేవంత్ ప్రకటించగానే భీమవరంలో వెంకటరెడ్డి ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపించింది. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో స్వీట్స్ పంచారు వెంకటరెడ్డి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. రేవంత్ కుమార్తె నైమిష, అల్లుడు సత్యనారాయణ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సో.. రేవంత్ వియ్యంకుడి ఊరు భీమవరం కావడంతో.. అక్కడ కూడా సంబరాలు జరిగాయి.