TELANGANA CONGRESS: బీసీ జపం మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. బీసీలపై హామీల వర్షం..

రేవంత్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించారు. బీసీ సంక్షేమశాఖను పూర్తి మంత్రిత్వ శాఖగా మార్చి.. బీసీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామన్నారు.

  • Written By:
  • Updated On - November 10, 2023 / 06:22 PM IST

TELANGANA CONGRESS: తెలంగాణ (TELANGANA)లో ఫుల్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న కాంగ్రెస్ (CONGRESS) పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. వరుసగా డిక్లరేషన్లు ప్రకటిస్తూ.. ప్రజల్లో రోజు రోజుకూ బలం పెంచుకుంటోంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ తాజాగా బీసీ డిక్లరేషన్‌ (BC DECLARATION) ప్రకటించింది. కామారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీసీలపై హామీల వర్షం కురిపించింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్‌ ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

Telangana BSP : ఐదో జాబితా విడుదల చేసిన తెలంగాణ బీఎస్పీ.. పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

రేవంత్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించారు. బీసీ సంక్షేమశాఖను పూర్తి మంత్రిత్వ శాఖగా మార్చి.. బీసీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామన్నారు. దళితబంధు తరహాలో బీసీ కమిషన్‌ ద్వారా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం బీసీలకు అందిస్తామంటూ చెప్పారు. ఐదేళ్లలో బీసీల కోసం రూ.లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు. రాజకీయాల్లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేస్తామంటూ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం 23 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామంటూ చెప్పారు. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్‌ అందిస్తామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు తెలంగాణలో వందకు వంద శాతం అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్‌ఎస్‌ పార్టీ ఓర్వలేకపోతోందని విమర్శించారు.

కర్నాటకలో కరెంట్‌ కష్టాలు ఉన్నాయన్న మాటల్లో వాస్తవం లేదంటూ చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టే అధికారాన్ని కట్టబెట్టారని.. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మరి ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్‌ వస్తుందో చూడాలి.