Bhatti Vikramarka : భట్టి విధేయతకు గుర్తింపు..

భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడుగా ఉన్నారు. ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా.. తాను మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. ఉమ్మడి ఏపీలో విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో 108 రోజుల పాటు 1350 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ పాదయాత్ర చేసే పార్టీయే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ భట్టి విక్రమార్కతో రిపీట్ అయింది. హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా చేస్తాడన్న పేరు ఉండటంతో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.

Gaddam Prasad Kumar : అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జన్మించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నిజాం కాలేజీ నుంచి డిగ్రీ, హైదరాబాద్ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో మంచి కమాండ్ ఉన్న లీడర్. 2007లో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 2009లో మొదటిసారిగా ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భట్టి. అదే ఏడాది అసెంబ్లీలో చీఫ్ విప్ గా నియమితులయ్యారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీసకరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు కూడా భట్టీ ఈ పదవిలోనే కొనసాగారు.

2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర రిజర్వుడ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి మళ్ళీ గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో మూడోసారి, 2023లో నాలుగోసారి గెలిచారు. మధిర నియోజకవర్గంలో సీపీఎం నేత బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించింది భట్టి విక్రమార్కనే. 2019లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా భట్టిని నియమించింది AICC.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగినా.. మధిరలో గెలిచి సత్తా చాటారు.

మధిరలో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. 2018లో 3 వేల 567 ఓట్ల మెజారిటీతో భట్టి గెలిచారు. ఈసారి అనూహ్యంగా 35 వేలకు పైగా మెజారిటీతో మధిర నుంచి విక్టరీ కొట్టారు. భట్టిని డిప్యూటీ సీఎం పదవి వరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. విధేయతకు పార్టీ అధిష్టానం మరోసారి గుర్తింపు ఇచ్చిందని అంటున్నారు.