Congress Manifesto : నేడు కాంగ్రెస్ మేని ఫెస్టో విడుదల..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) అంతిమ దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలు మేనిఫెస్టో పై దృష్టి స్పందించాయి. ఇందులో భాగంగానే నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫోస్టో రిలీజ్ చేయనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) అంతిమ దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలు మేనిఫెస్టో పై దృష్టి స్పందించాయి. ఇందులో భాగంగానే నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫోస్టో రిలీజ్ చేయనుంది. మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. గాంధీ భవన్ లో ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు ఖర్గే.. ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు భరోసా కల్పించేలా.. రైతులు, మహిళలు వంటి ప్రధాన అంశాలపై కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు..!

  • ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
  • సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
  • రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
  • వార్డు సభ్యులు గౌరవ వేతనం
  • ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
  • జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం
  • ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
  • ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ప్రత్యేక సంక్షేమ పథకాలు
  • పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
  • తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ