11 ministers, New Cabinet : రేవంత్ టీమ్ ఇదే !

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇవాళ 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కేబినెట్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తారు. మిగిలిన మంత్రులుగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇవాళ 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కేబినెట్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తారు. మిగిలిన మంత్రులుగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.

Traffic diversion : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపు.. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. ట్రాఫిక్ మళ్లింపు

ఒకసారి జిల్లాల వారీగా సమీకరణాలు చూసుకుంటే..

ఈ మంత్రివర్గంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. భట్టి విక్రమార్క మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకూ తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీకి బూస్టింగ్ తీసుకొచ్చారు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలు గెలుపొందడంలో పొంగులేటి, తుమ్మల కీలకంగా వ్యవహరించారు. పైగా వీళ్ళిద్ధరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడు.. మంత్రి పదవులు ఇవ్వాలని కండీషన్ కూడా పెట్టారు. దాంతో.. భట్టితో పాటు.. పొంగులేటి, తుమ్మలకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత కల్పించింది.

ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లకు మంత్రి పదవులు దక్కాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మరో సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంగతి చూస్తే.. కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. తర్వాత మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన జూపల్లి కృష్ణారావుకు ఈ కేబినెట్ లో చోటు కల్పించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు మహిళలకు అవకాశం లభించింది. కాంగ్రెస్ సీనియర్లు అయిన కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇక మొదటినుంచి కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరగా ఉంటున్న.. రేవంత్ రెడ్డికి అనుచరురాలు అయిన సీతక్కకు కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహకు అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలను రేవంత్ కేబినెట్ లోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు.

తెలంగాణ కేబినెట్ లో మొత్తం సీఎం సహా 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉండటంతో.. మరో ఆరుగురును తొందరలోనే కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని.. సీనియర్లు, పార్టీ విధేయులకు అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి కేబినెట్ లో ప్రమాణం చేయబోతున్న మంత్రులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.