TS EXIT POLLS: తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌కు ఓటర్లు అధికారం కట్టబెట్టబోతున్నారా..? నేషనల్ మీడియా, వివిధ సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే అదే అనిపిస్తోంది. CNN-న్యూస్ 18, చాణక్య స్ట్రాటజీస్, ఆరా, జన్ కీ బాత్, పీపుల్స్ పల్స్, రేస్, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్, పోల్ స్ట్రాట్, స్మార్ట్ పోల్, రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిల్లో పోల్ స్ట్రాట్ తప్ప మిగతా అన్ని పోల్స్ కూడా కాంగ్రెస్‌కే అధికారం దక్కుతుందని ప్రకటించాయి. పోల్ స్ట్రాట్ మాత్రం హంగ్ పరిస్థితి ఉంటుందని చెప్పింది. తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఓటర్లు వేసిన ఓట్లు EVMల్లో భద్రంగా ఉన్నాయి. ఇక డిసెంబర్ 3న ఫలితాలు రావడమే మిగిలి ఉంది.
KTR: ఎగ్జిట్ పోల్స్ అంతా నాన్సెన్స్.. మళ్లీ మాదే అధికారం: కేటీఆర్
పోలింగ్ టైమ్ ముగిసే నాటికి 63 శాతం పర్సంటేజ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. 5 గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి ఓట్లేసే అవకాశం ఇస్తారు కాబట్టి.. ఈ పర్సంటేజ్ పెరిగే ఛాన్సుంది. ఈసీ ఆదేశాలతో సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత దేశంలోని ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ని బయటపెట్టాయి. తెలంగాణకు సంబంధించి దాదాపు 10 సంస్థలు ఇచ్చిన సర్వేల్లో తొమ్మిది సర్వేలు… కాంగ్రెస్‌కు అధికారం దక్కే అవకాశం ఉందని ప్రకటించాయి. రిపబ్లిక్ టీవీ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్‌కు 67 నుంచి 78 సీట్లు వచ్చే ఛాన్సుంది. బీఆర్ఎస్‌కి 22 నుంచి 31 స్థానాలలోపు వస్తాయంటోంది. ఇక స్మార్ట్ పోల్ అయితే ఏకంగా 70 నుంచి 82 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. బీఆర్ఎస్‌కు 24 నుంచి 36లోపే అంటోంది. పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది. రిపబ్లిక్ టీవీ 58 నుంచి 68 సీట్లు కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. ఇంకా చాణక్య స్ట్రాటజీస్, ఆరా, జన్ కీ బాత్, రేస్, సీఎన్ఎన్, ఇండియా టీవీ లాంటి సర్వేలు కూడా కాంగ్రెస్‌కు తెలంగాణలో అధికారం దక్కుతుందని ప్రకటించాయి.
REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది.. తెలంగాణకు దొరల పాలన నుంచి విముక్తి: రేవంత్ రెడ్డి
ఈ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. పోలింగ్ తర్వాత మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్వే పోల్స్‌పై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయనీ.. కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమాగా చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. ఎగ్జిట్స్ పోల్స్ అన్నీ రాంగ్ అని కొట్టిపారేశారు. గతంలో కూడా ఇలాగే తప్పుడు రిపోర్టులు ఇచ్చారని అన్నారు. డిసెంబర్ 3న ఇవి తప్పని రుజువు చేస్తాం.. ఆ సంస్థలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతాయా అని ప్రశ్నించారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ వీస్తోందని ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు ప్రకటించాయి. అందుకే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత సహా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌నే టార్గెట్ చేసుకొని ప్రచారం చేశారు. పోలింగ్‌కు చివరి వారం రోజుల్లో జనం టర్న్ అయ్యారని గ్రహించిన కేసీఆర్.. తమ పాత మిత్రుడు, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను పిలిపించుకున్నారు. ఆయన కూడా ఇప్పుడేం చేయలేము.. జనంలో నెగెటివ్ టాక్ ఉందని చెప్పాడు. తమ సర్వేలు కూడా కేసీఆర్, కేటీఆర్ ముందేశారు. దాంతో కేసీఆర్ చివరి విడత ప్రచారంలో స్ట్రాటజీ మార్చారు.
తెలంగాణ సెంటిమెంట్, పథకాలు, కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందని అనే భయాన్ని జనంలో కలిగించేలా కేసీఆర్ ప్రసంగాలు సాగాయి. ఒకానొక దశలో నాకు 70యేళ్ళు వచ్చాయి.. నేను అనుభవించాల్సింది అంతా అనుభవించేశాను.. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చా. కాంగ్రెస్‌కి అధికారం ఇచ్చి మిమ్మల్ని మీరు బలి కాకండి అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో స్పీచెస్ నడిచాయి. సరే.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. ఈ సర్వేల ఫలితాలు సగం.. సగంగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కి చూపిస్తే అప్పుడు జనంలో కన్‌ఫ్యూజన్ ఉండేది. కానీ దాదాపు అన్ని సర్వేలూ క్లియర్ కట్‌గా కాంగ్రెస్‌కి మెజారిటీ ఇస్తుండటం విశేషం. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కరెక్టా.. కాదా అన్నది డిసెంబర్ 3న తేలనుంది.