ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఓటింగ్ శాతం నెమ్మదిగా పెరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 52 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఉదయం నుంచి కొనసాగిన ట్రెండ్‌తో పోలిస్తే.. ఇది ఎక్కువేనని చెప్పాలి. అయితే, హైదరాబాద్‌లో మాత్రం ఓటింగ్ శాతం పెరగడం లేదు. ఇక్కడ మూడు గంటల వరకు 32 శాతమే ఓటింగ్ నమోదైంది. ఈ లెక్కన అతి తక్కువ ఓటింగ్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యే అవకాశం ఉంది. నగర ఓటర్లు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక తెలంగాణలో అత్యధికంగా మెదక్‌లో 70 శాతం పోలింగ్ నమోదైంది.
ASSEMBLY ELECTIONS: నిద్రపోయింది చాలు.. వచ్చి ఓటెయ్.. హైదరాబాద్‌లో మళ్లీ అదే తీరు..
సెలబ్రిటీల పిలుపు, మీడియా ప్రచారం ద్వారా ఓటర్లు మధ్యాహ్నం నుంచి బయటకు వస్తున్నారు. భోజన సమయం తర్వాత నుంచి నెమ్మదిగా ఓటర్లు పోలింగ్ బూత్‌లవైపు కదులుతున్నారు. దీంతో చెప్పుకోదగ్గ ఓటింగ్ నమోదవుతోంది. కాగా, పదమూడు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ఓటింగ్ కొనసాగనుంది. మొత్తంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక కోటి 60 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ శాతం ఇలా ఉంది.
రంగారెడ్డి 30 శాతం, మహబూబ్ నగర్ 45 శాతం, మంచిర్యాల 43 శాతం, మెదక్ 51 శాతం, మేడ్చల్ 21 శాతం, సంగారెడ్డి 42 శాతం, సిద్ధిపేట 44 శాతం, సూర్యాపేట శాతం, ములుగు 46 శాతం, నాగర్ కర్నూల్ 40 శాతం, నల్గొండ 39 శాతం, నారాయణపేట్ 42 శాతంగా ఉంది. కేసీఆర్, రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 35 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. నిర్మల్ 42 శాతం, నిజామాబాద్ 40 శాతం, పెద్దపల్లి 44 శాతం, సిరిసిల్లలో 30 శాతం పోలింగ్ నమోదైంది.