Telangana elections : నామినేషన్ల కు మంచి ముహూర్తం ఎప్పుడు ? ఈ నెల 9న ఎక్కువమంది నామినేషన్లు !

తెలంగాణలో ఇప్పుడు పండితులకు ఫుల్లు గిరాకీ వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు.. ఇండిపెండెంట్ నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు వేసుకోవడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. దాంతో పార్టీల నుంచి బీఫారాలు అందుకున్న అభ్యర్థులు.. పండితులకు ఫోన్లు చేసి మంచి ముహూర్తం పెట్టాలని కోరుతున్నారు.

తెలంగాణలో (Telangana elections) ఇప్పుడు పండితులకు ఫుల్లు గిరాకీ వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు.. ఇండిపెండెంట్ నామినేషన్ (nominations)  వేయడానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు వేసుకోవడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. దాంతో పార్టీల నుంచి బీఫారాలు అందుకున్న అభ్యర్థులు.. పండితులకు ఫోన్లు చేసి మంచి ముహూర్తం పెట్టాలని కోరుతున్నారు.

Kaleshwaram Project: ప్రమాదపు అంచున కాళేశ్వరం..? డ్యాం సేఫ్టీ కమిటీ నివేదికలో సంచలన నిజాలు..

ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) తో పాటు కాంగ్రెస్ (Congress )లీడర్లలో కూడా చాలామందికి తిథి, వార, నక్షత్రాలపై నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ కూడా గత మూడు రోజులుగా రాజశ్యామల యాగం, శతచండీ యాగం చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డికి నామినేషన్ వేయబోతున్నారు.
అభ్యర్థుల నామినేషన్ కు వారం రోజులే టైమ్ ఉంది. అందులో కొన్ని రోజులు మంచివి లేవు. మరికొన్ని రోజులు తమ జాతక బలానికి పనికి రావు. మంగళవారం చాలామంది ఏ పనీ మొదలుపెట్టరు. ఇలా రకరకాల కారణాలతో మంచి ముహూర్తం బలంగా ఉండేలా చూసుకుంటున్నారు అభ్యర్థులు. ఈ నెల 7న దశమి నక్షత్రం ఉంది.. కార్యసిద్ధికి అనుకూలం. కానీ ఆ రోజు మంగళవారం.. అందుకే ఎవరూ నామినేషన్లు వేయడం లేదు.

Kaleshwaram project : కాంగ్రెస్‌కు ఆయుధంగా మారిన మేడిగడ్డ ప్రమాదం..

ఆ తరువాత ఈనెల 8న ఉదయం ఏడున్నర తర్వాత ఏకాదశి వస్తుంది. బాగానే ఉంటుంది. ఇక నవంబర్ 9నాడు గురువారం.. ఏకాదశి.. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉంది. ఆ రోజు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అన్నింటికీ అనుకూలంగా ఉండటంతో పాటు కార్యసిద్ధి కూడా ఉంది. అందుకే సీఎం కేసీఆర్ కూడా ఆ రోజే నామినేషన్ వేస్తున్నారు దాంతో ఈనెల 9న రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.

నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10.. ఆ రోజు ద్వాదశి ఉండటంతో పెద్దగా నామినేషన్లు వేసే అవకాశం కనిపించడం లేదు. అయితే బీఫారాలు ఆలస్యంగా అందుకునే అభ్యర్థులు మాత్రం.. చివరి రోజున నామినేషన్లు వేస్తారు. ఈనెల 9న నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉండటంతో.. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.