2023 Elections : విపక్షాల దిమ్మ తిరిగేలా కేసీఆర్‌ స్కెచ్‌.. ఏం చేయబోతున్నారంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయ్. ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయ్. జనాలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయ్. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దానికి తగినట్లుగానే ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15నుంచి సభలు, ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయ్. ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయ్. జనాలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయ్. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దానికి తగినట్లుగానే ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15నుంచి సభలు, ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.  15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో.. కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత పార్టీ బీ ఫారాలు అందిస్తారు.

15న పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలోన.. ఎన్నికల ప్రచార వ్యవహారాలు, సభలు , సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై సూచనలు చేయనున్నారు కేసీఆర్. అదే రోజు సాయంత్రం 4గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 15 నుంచి 18 వరకు వరుసగా నాలుగు రోజులపాటు జరిగే బహిరంగ సభల షెడ్యూల్‌ను బీఆర్ఎస్ ప్రకటించింది. 15న హుస్నాబాద్ , 16న జనగామ, భువనగిరి, 17న సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గల్లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్లలో… సాయంత్రం 4గంటలకు మేడ్చల్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఇక అదే సమయంలో ఎన్నికల కోసం కేసీఆర్ ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసి ఉంచారని తెలుస్తోంది. రెండుసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంగా.. బీఆర్ఎస్‌ మీద వ్యతిరేకత ఉన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. దీంతో ప్రత్యామ్నాయ ఓటు బ్యాంక్‌పై కేసీఆర్ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. మహిళల ఓట్లు గంపగుత్తగా సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలు గుప్పిస్తోంది. కేసీఆర్ కూడా అదే ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకున్నట్లు టాక్. దీనికోసం భారీ స్కెచ్ సిద్ధం చేశారని తెలుస్తోంది. మేనిఫెస్టోలో అది ప్రకటిస్తారా.. 15న మీడియా ముందు చెప్తారా అన్నది ఎదురుచూడాలి మరి.