YS SHARMILA: ఒంటరిపోరుకు సిద్ధమైన షర్మిల.. ఎన్నికల బరిలో విజయమ్మ, బ్రదర్ అనిల్..!

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. తాను ఖమ్మం జిల్లా పాలేరుతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని వెల్లడించారు. తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్ కూడా అవసరమైతే ఎన్నికల బరిలో దిగుతారని షర్మిల అన్నారు.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 04:31 PM IST

YS SHARMILA: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించారు. షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. తాను ఖమ్మం జిల్లా పాలేరుతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని వెల్లడించారు.

తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్ కూడా అవసరమైతే ఎన్నికల బరిలో దిగుతారని షర్మిల అన్నారు. “119 నియోజక వర్గాల్లో YSRTP పోటీ చేస్తుంది. 119 నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తాం. మా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్తులు బి ఫామ్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. నేను పాలేరు నుంచి పోటీ చేస్తా. రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది. బ్రదర్ అనిల్, విజయమ్మను కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉంది. అవసరం అయితే అనిల్ కూడా పోటీ చేస్తారు. విజయమ్మ సైతం పోటీ చేస్తారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం. ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నాం. ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం. 4 నెలలు ఎదురు చూశాం. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తాం” అన్నారు. గురువారం నుంచే నుంచే ఎన్నికల బరిలోకి దిగేలా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం వ్యూహంపై కార్యకర్తలకు సమావేశంలో షర్మిల దిశానిర్దేశం చేశారు. షర్మిల పాలేరుతోపాటు మిర్యాలగూడ నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కార్యవర్గ సమావేశం అనంతరం ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆలోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. మేనిఫెస్టోపై ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం నుంచి అన్ని నియోజకవర్గాలల్లో వైఎస్సార్టీపీ నేతలు ఎన్నికల బరిలో ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు.