హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ (Former Director) ఇంట్లో ఏసీబీ (ACB) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Bala Krishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 20చోట్ల ఏకకాలంలో మొత్తం 14 టీమ్స్ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆస్తుల గుర్తించునట్లు సమచారం.. బాలకృష్ణ ఇంటితో పాటు వారి బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో సోదాలు కోనసాగుతున్నాయి. నానక్ రామ్ గూడాలోని ఇంట్లో రూ.84 లక్షల నగదు స్వాధీనం 2 కిలోలకు పైగా బంగారం ఆభరణాలు, భారీగా వెండి సీజ్ పట్టుబడ్డ 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు కోట్ల రూపాయలు విలువ చేసే 75 ఎకరాల భూములు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది.
హైదరాబాద్ లో విల్లాలు, ప్లాట్లతో పాటు ఎకరాల కొద్దీ స్థలాలు గుర్తించారు. హైదరాబాద్ శివారు భూముల 100 ఎకరాల పత్రాలు.. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 24 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల భూమి పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలోని ఆయన ఇంట్లో రూ.84లక్షల క్యాష్, ఖరీదైన వాచీలు, 2 కిలోల బంగారాన్ని స్వాధీనం ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను సైతం సీజ్ చేశారు. అంతేకాకుండా బినామీల పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇక బాలకృష్ణ ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోని.. వారి బినామీల పేరుతో బాలకృష్ణ ఆస్తుల కొనుగోళ్లు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణ బినామీలు సత్యం, మూర్తి పరారిలో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో వారిని పట్టుకునేందుకు ఏసీబీ గాలింపు చర్యలు మొదలుపెట్టింది. రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో బినామీ పేర్లతో పెట్టుబడులు బాలకృష్ణ వివిధ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని శివ బాలకృష్ణ కోట్లలో సంపాదించినట్లు ఏసీబీ గుర్తించారని సమాచారం. శివ బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్నారు. ఇవాళ శివబాలకృష్ణకు చెందిన బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఇంట్లో నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న
కోర్టులో హాజరు పరిచి తిరిగి కస్టడీకి తీసుకోనున్నారు. 2018-2023 దాకా HMDA లోని HMR లో ప్లానింగ్ ఆఫీసర్ గా బాలకృష్ణ ఉద్యోగం చేస్తున్నారు. రెరాలో సెక్రటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ది చేస్తు 100 కోట్లు అక్రమాస్తులు సంపాదించాడు.