AUTO DRIVERS PROTEST: తెలంగాణలో ఆటో డ్రైవర్లు మహాధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నారు. ఆ రోజు ఆటోల బంద్ పాటిస్తారు. ఒక్క ఆటో కూడా ఆ రోజు తిరగకూడదని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
Gas cylinder at Rs 500: తెల్ల రేషన్ కార్డు ఉన్నా లాభం లేదు.. వాళ్లకే రూ. 500 గ్యాస్ సిలిండర్..
దీంతో తెలంగాణలోని మహిళలంతా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలుకాగా.. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు జీరో టిక్కెట్ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఫలితంగా ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు భారీగా నష్టపోతున్నారు. తమ జీవనోపాధి కరువైందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆటోవాలాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు నిరసనలు తెలిపారు.
ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిశారు. కానీ, ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఏ ప్రోత్సాహం దక్కలేదు. దీంతో ప్రభుత్వానికి తమ సమస్యలు తెలిపేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధమవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ వేదని తెలియాలని, ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 16న నిరసనకు దిగబోతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.