BANDLA GANESH : మల్కాజ్ గిరి ఎంపీ రేసులో బండ్ల గణేష్

ఎమ్మెల్సీ అవుతాను... శాసనమండలిలో అడుగుపెట్టి అధ్యక్షా అంటా అనుకున్న నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) కు జాక్ పాట్ తగిలిందా... ఎమ్మెల్సీ కాదు... ఏకంగా ఎంపీ పోస్టే ఇవ్వాలని TPCC డిసైడ్ అయిందా...? పార్లమెంట్ (Parliament) కి వెళ్ళి... అక్కడ అధ్యక్షా అనే అవకాశం కల్పిస్తోందా... మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గానికి బండ్ల గణేష్ దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.

ఎమ్మెల్సీ అవుతాను… శాసనమండలిలో అడుగుపెట్టి అధ్యక్షా అంటా అనుకున్న నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) కు జాక్ పాట్ తగిలిందా… ఎమ్మెల్సీ కాదు… ఏకంగా ఎంపీ పోస్టే ఇవ్వాలని TPCC డిసైడ్ అయిందా…? పార్లమెంట్ (Parliament) కి వెళ్ళి… అక్కడ అధ్యక్షా అనే అవకాశం కల్పిస్తోందా… మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గానికి బండ్ల గణేష్ దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో ఎంపీగా పోటీ చేసే ఉత్సాహవంతుల నుంచి TPCC అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అందులోభాగంగా బండ్ల గణేష్ మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ కోసం అప్లయ్ చేసుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) అధికారంలోకి రావడం… సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ నిర్మాత బండ్ల గణేస్ హడావిడి అంతా ఇంతా కాదు… బీఆర్ఎస్ (BRS) లీడర్లను తెగ తిట్టేస్తూ… రేవంత్ ను ఆకాశానికి ఎత్తుతూ ప్రెస్ మీట్స్ పెట్టడం… మీడియా కనిపిస్తే బైట్స్ ఇవ్వడం చేస్తున్నారు. రేవంత్ ఎక్కడ కనిపిస్తే అక్కడ బొకేలు ఇస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంతేకాదు… కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ … హైదరాబాద్ కు వస్తే ఎయిర్ పోర్టులో ఎదురెళ్లి స్వాగతం చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తున్నారనీ… గవర్నర్ కోటాలో గానీ… ఖాళీలైన రెండు సీట్లల్లో ఒకటి గానీ ఇస్తారని బండ్ల గణేష్ కలలు గన్నారు. అధిష్టానం దగ్గరకు కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. కానీ అవేవీ నెరవేరలేదు. దాంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని నిర్ణయించారు. అందుకే గాంధీభవన్ లో టిక్కెట్ కోసం అప్లయ్ చేసి… ప్రెస్ మీట్ పెట్టి… రేవంత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను ఆకాశానికి ఎత్తుతూ మరోసారి మాట్లాడారు బండ్ల గణేష్. కానీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి చిక్కులు వస్తాయోనని ముందే జాగ్రత్త పడ్డారు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థులను నిర్ణయించే అధికారం AICC కి వదిలిపెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ కి ఇంత ఫీజు అని కూడా నిర్ణయించారు. దాంతో ఉత్సావహవంతులు గాంధీ భవన్ కు వచ్చి అప్లయ్ చేస్తున్నారు.

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అప్లయ్ చేశారు నిర్మాత బండ్ల గణేష్. గతంలో తనకు పదవి ఇవ్వాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను చాలా సార్లు కలిసి వచ్చారు. ఎమ్మల్సీ వీలుకాకపోతే… ఎంపీ టిక్కెట్ అయినా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం రేవంత్ ఆశీస్సులు కూడా ఉండటంతో ఈ సీటు తనకే వస్తుందని బండ్ల గణేష్ భావిస్తున్నారు. నిజానికి చాలా యేళ్ళ నుంచి గణేష్… కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆ మాటకొస్తే… బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ నుంచి హస్తం పార్టీకి సపోర్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఆయనే. అప్పటి నుంచి కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్న తనకు ఇప్పుడు మల్కాజ్ గిరి టిక్కెట్ అయినా ఇవ్వాలని బండ్ల గణేష్ కోరుతున్నారు. ఆయన రిక్వెస్ట్ ను అధిష్టానం ఎంతవరకు పరిశీలిస్తుంది… రేవంత్ రెడ్డి సాయం చేస్తారా అన్నది తొందర్లోనే తేలనుంది.