Pedpadalli MP Venkatesh : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

పార్లమెంట్ (Parliament) ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్ తగలింది. పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్‌ (BRS) కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ తో కలసి వెళ్ళిన కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాట్లు ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే సమక్షంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వెంకటేశ్.. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈసారి పెద్దపల్లి బీఆర్ఎస్ టిక్కెట్ డౌటే అన్న సంకేతాలు రావడంతో.. ఆ టికెట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కేటాయిస్తున్నట్లు సమచారం ఉండంతో.. అధికార పార్టీ కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కుతుంది అన్న.. అవకాశంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకన్నారు.