DK Aruna : డీకే అరుణకు బిగ్‌షాక్.. జేజమ్మ ప్రయాణం ఎటు..

ఫస్ట్ లిస్ట్‌లో డీకే అరుణ (DK Aruna) కు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్ట్‌ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు.. ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ (BJP) అధిష్టానం. తెలంగాణ నుంచి తొమ్మది మంది అభ్యర్థులను ఫైనల్‌ చేశారు. సికింద్రాబాద్‌ నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్‌, జహీరాబాద్‌లో బీబీ పాటిల్ (Bibi Patil), నాగర్ కర్నూల్‌లో భారత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్లలో కొండ విశ్వేశ్వర రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌కు (Etala Rajender) అవకాశం ఇచ్చింది బీజేపీ.

ఫస్ట్ లిస్ట్‌లో డీకే అరుణ (DK Aruna) కు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్ట్‌ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు.. ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో.. డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election) పోటీ చేయకుండా తప్పుకున్నారు. తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరి అయ్యాయి. ఐతే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ వివాదాలు కొనసాగుతున్నాయ్. ముగ్గురు ముఖ్యనేతలు ఆ టికెట్ ఆశిస్తున్నారు.

డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బండారు శాంతి కుమార్‌ (Bandaru Shanti Kumar) కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉండటంతో బీజేపీ హైకమాండ్ సీటు ప్రకటనను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి వీరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే ఉత్కంఠ జనాల్లో కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు షాక్ తగిలింది. ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. మలి విడతలోనూ ఛాన్స్‌ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయ్.