Telangana BJP : లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అస్త్రాలు సిద్ధం

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం సకల అస్త్ర శస్ర్తాలను సిద్ధం చేసుకుంటోంది బీజేపీ(BJP). తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టాలన్న టార్గెట్‌తో గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది. రక రకాల లెక్కలు, ఎక్కాలతో అభ్యర్థుల ఎంపికపై నజర్‌ పెట్టింది అధిష్టానం. అదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పెరిగిపోతోందట. అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం, మోడీ చరిష్మా కలిసి వచ్చి గెలుపు తేలికవుతుందన్న అంచనాలతో ఎవరికి వారు సీటు మాకంటే మాకంటూ ఓ రేంజ్‌లో లాబీయింగ్‌ చేస్తున్నారట.

అసెంబ్లీ ఎన్నికల్లోనే (Assembly Elections) చాలా చోట్ల ఓట్ల శాతం గణనీయంగా పెరిగినందున లోక్‌సభ ఎలక్షన్స్‌ టైంకి అది ప్లస్‌ అవుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదనీ… అందుకే తాము కూడా తగ్గేదేలే అంటున్నారట బీజేపీ ఆశావహులు. దీంతో ఆ లిస్ట్‌ కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. రిజర్వుడ్‌ సీట్లు, సిట్టింగ్‌ స్థానాలకు కూడా పోటీ విపరీతంగా పెరిగిపోతోందట. కొందరు నాయకులైతే… సిట్టింగ్‌ ఎంపీల కంటే తామేం తక్కువ అంటూ టిక్కెట్‌ రేస్‌లోకి దూసుకు వస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో సికింద్రాబాద్ మినహా మిగతా మూడు చోట్లా నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ సీటు కోసం జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారట. సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఈసారి అభ్యర్థిని మార్చాలని పార్టీ వర్గాల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఆశావహులు టిక్కెట్‌ కోసం స్పీడ్‌ పెంచుతున్నట్టు తెలుస్తోంది. యండల లక్ష్మీనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు సీరియస్‌ ట్రయల్స్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ సీటు కోసం ఓ మీడియా సంస్థ అధినేత ప్రయత్నాల్లో ఉన్నారట. మరోవైపు నియోజకవర్గంలోని బండి సంజయ్ వ్యతిరేక వర్గం నేతలు ఈసారి అవకాశం మాకే కావాలంటున్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్ సుగుణాకర్‌రావు ఈ టిక్కెట్‌ అడుగుతున్నారట.

ఆదిలాబాద్ లోనూ అదే పరిస్థితి. సిట్టింగ్‌ ఎంపీకి టికెట్ ఇవ్వొద్దని ఆ పార్లమెంట్ సీటు పరిధిలోని బీజేపీ ఎమ్మేల్యేలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయంగా ఇంకా ఆ పార్టీలో చేరని ఒక నేత పేరు సూచిస్తున్నారట. రమేష్ రాథోడ్‌తో పాటు ఒకరిద్దరు పార్టీ నేతలు ఆదిలాబాద్‌ మీద ఆశలు పెట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయకుంటే తమకు అవకాశం ఇవ్వాలని కొందరు అడుగుతున్నట్టు తెలిసింది. కిషన్‌రెడ్డి పోటీలో ఉంటారా? లేదా? అన్న దాన్ని బట్టి వాళ్ళ అవకాశాలు ఉంటాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్లలో పోటీ రసవత్తరంగా మారుతోంది. చివరికి సిట్టింగ్‌లకే మరో ఛాన్స్‌ దక్కుతుందా లేక కొత్త ముఖాలు తెరమీదికి వస్తాయా అన్నది చూడాలి.