BRS-KCR: బీఆర్ఎస్‌ నీటి పోరు యాత్ర.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్

బీఆర్ఎస్ గట్టిగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది బీఆర్ఎస్. అందుకే ఇప్పుడు కేసీఆర్ తన తప్పుల్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 05:48 PM IST

BRS-KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ క్యాడర్‌లో నిరాశ కనిపిస్తోంది. పైగా కేసీఆర్ పాలనలో అవినీతి అంటూ, కాంగ్రెస్ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ అండ్ కో దోపిడీకి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్‌కు, నాయకుడిగా కేసీఆర్‌కు ప్రజలు పదేళ్లు అధికారం కట్టబెట్టారు. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలను ఇబ్బంది పెట్టడం, భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు.

‎Palvai Harish Babu: రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఏం జరుగుతోంది ?

ఇలాంటివన్నీ కేసీఆర్‌కు మైనస్‌గా మారాయి.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గట్టిగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది బీఆర్ఎస్. అందుకే ఇప్పుడు కేసీఆర్ తన తప్పుల్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో నీటి పోరు యాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో త్వరలో భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే.. ఇటు కృష్ణా, అటు గోదావరి నుంచి నీటి పోరు పేరుతో యాత్ర నిర్వహించబోతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ఇప్పటికే నల్గొండలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌ కావడం నిరాశలో ఉన్న కార్యకర్తలకు​ జోష్‌ నింపింది. ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది.

తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతుంది. ఇక.. నీటి పోరు యాత్రను దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్‌, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి ప్రారంభించబోతుంది బీఆర్ఎస్. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణలో తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్లాన్‌ చేశారు.