T CONGRESS: తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మిగలదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలు ఉత్తి ప్రచార ఆర్భాటమేనా..? నిజంగా.. బీఆర్ఎస్ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఇప్పుడు ఇవే సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని.. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. బీఆర్‌ఎస్‌ఎల్పీని విలినం చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.
MEGASTAR CHIRANJEEVI: ఏపీ ఎన్నికల్లో కూటమికే చిరంజీవి మద్దతు.. వారికోసం స్పందించిన చిరు
కానీ, పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇప్పటివరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్, కడియం కూతురుకు వరంగల్ ఎంపీ టిక్కెట్ దక్కడంతోనే వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం.. పొంగులేటి అనుచరుడు అనే పేరుంది. కాబట్టి.. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరడంలో ఆశ్చర్యం లేదు. కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెస్‌లో చేరడం లేదు. సీఎం రేవంత్‌ను, మంత్రుల్ని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కొందరు ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాగని వాళ్లు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ నేతలు కూడా చెప్పలేదు. కానీ, ఆయా నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకే సీఎంను కలిశారని, చర్చలు జరిపారని ప్రచారం మొదలైంది. ఇక రేపో.. మాపో.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమన్నంతగా హైప్ క్రియేట్ అయింది.
కానీ, వాళ్లెవరూ ఇప్పటిదాకా కాంగ్రెస్‌లోకి రాలేదు. కొందరు వివిధ కారణాలతో ఆగిపోగా.. ఇంకొందరి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎన్నికల తర్వాత చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారనే మరో వాదనా వినిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ చెప్పుకొంటున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమీ క్యూ కట్టడం లేదు. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి, బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేస్తారా.. లేక.. ప్రచారం కోసమే కాంగ్రెస్ అలా చెబుతోందా.. ఇందులో కాంగ్రెస్ వ్యూహం ఉందా.. అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.