BRS MLA’S: కాంగ్రెస్ నేత పిటిషన్.. తమిళనాడు కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

మాణిక్కం ఠాకూర్ రూ.500 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాణిక్కం ఠాకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందని ఆయన భావించారు.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 08:33 PM IST

BRS MLA’S: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్‌పై ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం వాళ్లు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. మాణిక్కం ఠాకూర్‌ గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలోనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ను చేసింది.

Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. దూరంగా ఉండనున్న కాంగ్రెస్..

అయితే.. మాణిక్కం ఠాకూర్ రూ.500 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాణిక్కం ఠాకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందని ఆయన భావించారు. దీంతో మాణిక్కం ఠాకూర్‌.. తన పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డిపై తన స్వస్థలం మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. ఇద్దరినీ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు.. ఇద్దరికీ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు చేయడం ఖాయమని తేలడంతో వెంటనే కోర్టుకు హాజరై వారెంట్లను రీకాల్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరూ మధురై కోర్టు ఆవరణలో ఉన్న ఫోటోలను మాణిక్కం ఠాకూర్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా.. తప్పుడు ఆరోపణలు చేసిన ఎవరినీ వదిలేది లేదని.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మాణిక్కం ఠాకూర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాణిక్కం ఠాకూర్‌‌ను అధిష్టానం.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా నియమించింది. తెలంగాణకు దీప్ దాస్ మున్షిని ఇంచార్జిగా నియమించింది అధిష్టానం.