Chinthapally Police Station: వాస్తు బాగోలేదు.. పోలీస్ స్టేషన్‌కు వాస్తు మార్పులు

నల్గొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు భాగంలో స్టోర్ రూమ్‌ను కూల్చేశారు అధికారులు. ఎందుకంటే ఈ స్టేషన్ ఎస్సైలకు కలిసిరావడం లేదట. గత కొన్నేళ్ళుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 10 మందికి పైగా సబ్ ఇన్సెపెక్టర్లు బదిలీ అయ్యారు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 04:52 PM IST

Chinthapally Police Station: ఇంటికి వాస్తు ఎలా ముఖ్యమో.. పోలీస్ స్టేషన్‌కూ అంతే ముఖ్యం అంటున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. వాస్తు బాగోలేకనే ఆ స్టేషన్‌కు వచ్చిన SIలు వివాదాల్లో చిక్కుకోవడమో.. ట్రాన్స్‌ఫర్లు అవడమో జరుగుతోందని నిర్ణయించారు. అందుకే పోలీస్ స్టేషన్‌లో కొన్ని రూములు కూల్చేస్తూ.. మరికొన్నింటిలో మార్పులు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు భాగంలో స్టోర్ రూమ్‌ను కూల్చేశారు అధికారులు. ఎందుకంటే ఈ స్టేషన్ ఎస్సైలకు కలిసిరావడం లేదట.

MLA MS Babu: టిక్కెట్ల విషయంలో దళితులకు అన్యాయం.. జగన్ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

గత కొన్నేళ్ళుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 10 మందికి పైగా సబ్ ఇన్సెపెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమధ్యే భూ వివాదంలో తలదూర్చి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన SI సతీష్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. దాంతో చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తుమార్పుల్లో భాగంగా ముందు భాగంలో ఉన్న స్టోర్ రూమ్ ను గత నెల 29న కూల్చివేశారు పోలీస్ అధికారులు. హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేకి పక్కన.. హైదరాబాద్‌కు దగ్గరగా ఉంది చింతపల్లి పోలీస్ స్టేషన్. దాంతో ఇక్కడకు వచ్చేవన్నీ పైరవీ పోస్టింగులే. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న మండలం కావడంతో పోలీసుస్టేషన్‌కు భూవివాదాల పంచాయతీలు కూడా ఎక్కువే. ఈ భూవివాదాల్లో తలదూర్చటం.. వివాదాలకు కేంద్రంగా మారడం వల్లే.. సబ్ ఇన్సెపెక్టర్ల బదిలీలు జరిగాయి. లేదంటే సస్పెన్షన్ అవడం అనేది చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో నిత్యకృత్యంగా మారింది.

కొద్ది రొజుల క్రితం ఓ భూ వివాదంలో ఓ వ్యక్తిని ఎస్సై సతీష్ రెడ్డి చితకబాదాడు. అతను మృతి చెందడంతో ఎస్ఐ సతీష్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. గత కొన్నేళ్ళుగా వివిధ కారణాలతో దాదాపు పది మందికి పైగా ఎస్సైలు బదిలీ అయ్యారు. మరికొందరు తీవ్ర ఆరోపణలతో సస్పెండ్ కూడా అయ్యారు. దీనంతటికీ కారణం వాస్తు దోషమేనని తేల్చేసారు.. వాస్తు మార్పులు కూడా చేసేసారు. కానీ వచ్చే ఎస్సైల బుద్ధి వంకర బుద్ధనీ.. ఎన్ని వాస్తు మార్పులు చేస్తే ఏం లాభం అని చింతపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.