BRS: బీఆర్ఎస్‌ భవన్‌ వేదికగా రచ్చ.. కారు పార్టీలో భగ్గుమన్న విభేదాలు..

తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గ విబేధాలు మళ్లీ బయటపడ్డాయ్. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష.. రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 03:17 PM IST

BRS: అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు.. వరుసగా షాక్‌ల మీద షాక్‌లు కదులుతున్నాయ్. కారు దిగి చాలామంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వరంగల్‌ మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ వైపు చూస్తూ.. మేయర్‌ను మార్చేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ.. కారు పార్టీలో ఆధిపత్య పోరు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గ విబేధాలు మళ్లీ బయటపడ్డాయ్. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష.. రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.

YS JAGAN: వైసీపీ మూడో జాబితా సిద్ధం.. పది మంది సిట్టింగ్‌లకు షాక్ తప్పదా..?

వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. దీంతో కొంచెం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల కోసం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం సమీక్షలు జరుపుతోంది. ఇదే వరుసలో చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్‌ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్‌ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్‌ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్‌ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్‌ బ్రేక్‌ అనౌన్స్‌ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముదరకుండా ఆగిపోయింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్‌ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు.

ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడమే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు పైలట్, పట్నం మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించింది. పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కాళ్లు మొక్కారు పైలట్. దీంతో ఇద్దరు కలిపోయారు అనుకుంటే.. ఇప్పుడు వర్గ విభేదాలు చూస్తుంటే.. అది నిజం కాదు అనిపిస్తోంది.