ASAD TENSION : అసదుద్దీన్ కి ఓటమి టెన్షన్.. వాళ్ళు ఎందుకు ఓట్లెయలేదు !

పాతబస్తీలో 40యేళ్ళుగా MIM పాగా వేసింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా ... డమ్మీగా నిలబెట్టాల్సిందే. కానీ ఈసారి MIM నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి టెన్షన్ పట్టుకుందట.

పాతబస్తీలో 40యేళ్ళుగా MIM పాగా వేసింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా … డమ్మీగా నిలబెట్టాల్సిందే. కానీ ఈసారి MIM నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి టెన్షన్ పట్టుకుందట. ఎంపీ సీటు చేజారుతుందేమోనని ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఈసారి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 46 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అందులోనూ MIM కి గట్టి పట్టున్న అసెంబ్లీ స్థానాలైన చార్మినార్, యాకుత్ పురా, చంద్రాయణగుట్టల్లో 42 నుంచి 48 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అలాగే మజ్లిస్ కి గట్టిపట్టు ఉన్న మలక్ పేటలోనూ ఈసారి ఓటింగ్ శాతంగా భారీగా తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పోలింగ్ శాతం తక్కువైందని అప్పట్లో MIM ఎమ్మెల్యేలు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అంతకంటే తక్కువగా నమోదు కావడంతో అసద్ కు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాధవీలత గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఎన్నికల ముందు కొన్ని దొంగ ఓట్లను తొలగించింది ఈసీ. పైగా ఈ నియోజకవర్గంలోని గోషామహల్, కార్వాన్ లో బీజేపీకి బలంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 55శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకే పడతాయి. ఈ నియోజకవర్గాలతో పోలిస్తే యాకుత్ పురా, చంద్రాయణ్ గుట్ట, చార్మినార్, మలక్ పేట తక్కువగా పోలింగ్ నమోదైంది. అప్పటికీ పోలింగ్ రోజున MIM కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి… తలుపులు బాదుతూ ఓట్లు వేయాలని కోరారు. అయినా జనం బయటకు రాలేదు. ఓట్లు వేయలేదు.

MIM కి హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లోనూ మాధవీలత ప్రచారం జోరుగా సాగింది. ముస్లిం మహిళలతో పాటు మైనార్టీల సమస్యలను ఆమె ప్రచారంలో ప్రస్తావించారు. దాంతో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్… హిందూ ఓటర్ల ఇళ్ళకు వెళ్ళడం, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటూ ఆ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం… ముస్లిం మహిళల ఓట్లు బీజేపీకి టర్న్ అవుతాయన్న టెన్షన్, బీజేపీకి పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ పోలింగ్ నమోదు అవడం… లాంటి కారణాలు అసద్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. కుడి ఎడమైతే అన్నట్టుగా ఒకవేళ అసద్ ఓడితే పరిస్థితి ఏంటి… హైదరాబాద్ లోక్ సభలో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణపైనే కాదు… దేశవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుందనడం డౌటే లేదు.