సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణా ఫిలిం డెవల్ప్‌మెంట్ కార్పోరేషన్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. పుష్ప సినిమా రిలీజ్ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయం లో ఇండస్ట్రీ కు ప్రభుత్వం కు బ్రిడ్జి గా పని చెయ్యాలని చెప్పారు సిఎం… ఇన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడం తో హాస్పిటల్ కు రాలేకపోయా అంటూ కామెంట్స్ చేసారు. నగరానికి రాగానే ఈ రోజు సిఎం ను కలిశాననన్నారు.
భాస్కర్ కు ఇండస్ట్రీ లో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సిఎం కు చెప్తే..సిఎం మంచి నిర్ణయం అని చెప్పారని ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీ కు అన్ని విధాలుగా సహకారం ఉంటుంది అని సిఎం అన్నారని తెలిపారు. శ్రీ తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని రీకవర్ అవుతున్నాడని తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్త..అన్ని విషయాలు తెలుసుకుంటాను అన్నారు. సినిమా కు సంబంధించిన అందరం త్వరలో సిఎం ను కలుస్తామన్నారు.
సిఎం భరోసా ఇవ్వమన్నారు,అందుకే ఇక్కడి వచ్చి భాస్కర్ కు భరోసా ఇస్తున్నామని తెలిపారు. రేవతి చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. భాస్కర్ ను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రేపు లేదా ఎల్లుండి సీఎం గారు అపాయిన్మెంట్ ఇస్తాను అన్నారని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలతో సీఎం గారిని కలవబోతున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండస్ట్రీని దూరం చెయ్యడం లేదని రకరకాల న్యూస్ లు వస్తున్నాయి.. అన్ని వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. FDC ద్వారా అన్ని చేస్తామన్నారు సీఎం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి బ్రిడ్జి గా నేను ఉంటాను.. సీఎం నాకు భాధ్యత ఇచ్చారన్నారు దిల్ రాజు.