ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) సింగర్ సాయిచంద్‌కు (Singer Saichand) ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చిన తరువాత సాయిచంద్‌కు కూడా అంతే ప్రధాన్యత ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ (KCR) . రెండోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాయిచంద్‌కు వేర్‌హౌజ్ కార్పోరేషన్ చైర్మన్‌గా పదవి ఇచ్చారు. కానీ ఈ పదవి చేపట్టిన కొన్ని రోజులకే సాయిచంద్ హార్ట్‌ఎటాక్‌తో చనిపోయారు. దీంతో అదే పదవిని ఆయన భార్య రజినికి ఇచ్చారు. సాయిచందే ప్రాణంగా బతికిన రజినీ పదవిలోనే భర్తను చూసుకున్నారు. కానీ రజిని పదవీ బాధ్యతలు పూర్తి కాకుండానే ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది. దీంతో పాత గవర్నమెంట్‌లో ఉన్న చైర్మన్ పదవులను తొలగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె స్థానంలో పాలేరు కాంగ్రెస్ లీడర్ రాయల రాగేశ్వర్ రావును నియమించారు.
రజినిని పదవి నుంచి తొలగించిన టైంలో ఆ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే రజినికి పదవి వచ్చిన సందర్భం ప్రత్యేకం. ఓ పక్క భర్త లేని లోటు.. మరోపక్క ఇద్దరు పిల్లల బాధ్యత. ఈ రెండిటి మధ్యతో పదవీ బాధ్యతలు చేపట్టారు రజినీ. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా రజినిని అదే పదవిలో కంటిన్యూ చేస్తారని అంతా అనుకున్నారు. రాజకీయ నేతగా కాకుండా కళాకారుడిగా సాయిచంద్‌కు ప్రత్యేక స్థానం ఇచ్చి ఆ పదవిని రజినికే వదిలేస్తారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రజిని కూడా తన పదవికి రాజీనామా చేయలేదు. అంతా వరుసగా పదవులకు రాజీనామా చేస్తున్నా.. రజిని మాత్రం అదే పదవిలో కంటిన్యూ అయ్యారు.
దీంతో ఆ పదవిలో ఆమె కొనసాగుతారని అంతా అనుకున్నారు. రజిని కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నారు.. అందుకే ఇంకా రాజీనామా చేయలేదు అని కూడా వార్తలొచ్చాయి. కానీ.. కొన్ని రోజులకే రజినిని పదవి నుంచి తొలగించారు. ఆమె ఆఫీస్‌కు రాకుండానే సాయిచంద్ ఫొటోను కూడా ఆఫీస్‌లో నుంచి తీసేశారు. ఈ విషయంలో రజిని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను రాకుండానే తన భర్త ఫొటోను తీసేయడం తనను కలచివేసిందని చెప్పారు. కానీ ఇప్పుడు అదే కుర్చే వేరే వ్యక్తికి ఇచ్చారు రేవంత్ రెడ్డి. పాత కార్పోరేషన్ పదవులతో పాటు రాష్ట్రంలో కొత్తగా కార్పోరేషన్ పదవులను ఏర్పాటు చేశారు. అన్ని కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇందులో భాగంగానే వేర్‌హౌజ్ కార్పోషన్ పదవిని నాగేశ్వర్‌రావుకు అప్పగించారు. మిగతా కార్పోరేషన్‌ల సంగతి పక్కన పెడితే.. వేర్‌హౌజ్ కార్పోరేషన్ నియామకం మాత్రం ఆసక్తికరంగా మారింది.