FREE POWER : మార్చిలో కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు.. గృహజ్యోతికి ఎవరు అర్హులంటే !

తెలంగాణలో (Telangana Government) ఇళ్ళకు ఉచిత కరెంట్ స్కీమ్ (Free Current Scheme) అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) 6 గ్యారంటీల్లో (Six Guarantees) భాగంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ (200 Units Free Current) వాడుకునేవాళ్ళు ఇకపై కరెంట్ బిల్లు కట్టనక్కర్లేదు.

తెలంగాణలో (Telangana Government) ఇళ్ళకు ఉచిత కరెంట్ స్కీమ్ (Free Current Scheme) అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) 6 గ్యారంటీల్లో (Six Guarantees) భాగంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ (200 Units Free Current) వాడుకునేవాళ్ళు ఇకపై కరెంట్ బిల్లు కట్టనక్కర్లేదు. ఈనెల అంటే … ఫిబ్రవరి నుంచే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. మార్చి నెలలో వచ్చే కరెంట్ బిల్లుకు డబ్బులు కట్టనక్కర్లేదు. జీరో బిల్లులు జారీ చేస్తారు. కానీ ఈ స్కీమ్ అందరికీ వర్తించదు. అందుకు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది.

ప్రజాపాలన కార్యక్రమంలో… ఇంటికి ఉచిత విద్యుత్ కావాలని అప్లయ్ చేసిన వాళ్ళకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే కుటుంబానికి ఫిబ్రవరి నుంచే బిల్లులు మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఫిబ్రవరి నెల బిల్లును మార్చి మొదటి వారంలో విద్యుత్ సిబ్బంది జారీ చేస్తారు. అప్పుడు ఈ పథకానికి అర్హులైన వారికి జీరో కరెంట్ బిల్లును ఇస్తారు. అయితే ఈ స్కీమ్ వర్తించాలంటే ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. ప్రజాపాలనలో ఫ్రీ కరెంట్ (Free current) కోసం అప్లయ్ చేసిన వారు… తమ యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ ను అప్లికేషన్ లో రాసి ఉండాలి. రేషన్ కార్డుకి ఆధార్ లింక్ అవ్వాలి. అలాగే ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ మాత్రమే ఇస్తారు. ఒకరి కనెక్షన్ ఇంకొరి పేరుతో మార్చడానికి వీల్లేదు. గత ఏడాదిలో అంటే 2022-23లో 12 నెలల్లో నెలకు 200 యూనిట్ల లోపు మాత్రమే కరెంట్ వాడుకొని ఉండాలి. అంటే ఏడాది మొత్తం మీద 2 వేల 181 యూనిట్లలోపు వాడిన వారికి మాత్రమే ఈ గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. దీంతో పాటు… ఈ నెల వాడుకునే కరెంట్ కూడా 200 యూనిట్ల లోపే ఉండాలి. ఉచిత విద్యుత్ వర్తించే వారు తప్పనిసరిగా పాత బకాయిలు ఉంటే చెల్లించాలి.

గృహజ్యోతి పథకాన్ని (Griha Jyoti Scheme) రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల మందికి పైగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం 4 వేల 164 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఇప్పటికే 101 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. వారిని కూడా గృహజ్యోతి పథకంలో కలిపేస్తారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకుంటున్న గృహజ్యోతి లబ్దిదారుల నుంచి ఆధార్ కార్డుతోపాటు రేషన్ కార్డు వివరాల సేకరణను ఈనెల 15లోపు పూర్తి చేయాలని విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఒక వేళ ఎవరైనా ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టకపోయినా వారి వివరాలను కూడా సేకరించనున్నారు విద్యుత్ శాఖాధికారులు.