MLA, Lasya Nandita, Life History : ఇంజనీర్‌ టూ ఎమ్మెల్యే.. లాస్య నందిత లైఫ్‌ హిస్టరీ..

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) మృతి తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే లాస్య చనిపోయవడం అత్యంత విషాదంగా మారింది. సరిగ్గా గతేడాది ఇదే నెలలో.. లాస్య తండ్రి, కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కూడా చనిపోయారు.

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) మృతి తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే లాస్య చనిపోయవడం అత్యంత విషాదంగా మారింది. సరిగ్గా గతేడాది ఇదే నెలలో.. లాస్య తండ్రి, కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కూడా చనిపోయారు. ఇప్పుడు లాస్య కూడా సరిగ్గా అదే నెలలో చనిపోయింది. 1986లో హైదరాబాద్‌లో జన్మించింది లాస్య. సాయన్న గీత దంపతులకు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో లాస్య పెద్దది. తండ్రి రాజకీయ వారసురాలిగా మొదటిసారి పికెట్‌ నుంచి 4వ వార్డ్‌ మెంబర్‌గా లాస్య నందిత ఎన్నికల్లో అరంగేట్రం చేసింది. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది.

ఆ తరువాత 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి కార్పోరేటర్‌గా కొనసాగింది. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. అప్పటి నుంచి తండ్రి రాజకీయ వారసురాలిగానే కాకుండా.. బీఆర్‌ఎస్‌ (BRS) నేతగా కొనసాగుతోంది. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. దీంతో ఆయన స్థానంలో ఆ ఎమ్మెల్యే టికెట్‌ లాస్యకు ఇచ్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఆ తరువాత వచ్చిన జనరల్‌ ఎలక్షన్స్‌లో లాస్య ఎమ్మెల్యేగా గెలిచింది. 37 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో అతితక్కువ వయసున్న కొద్ది మంది ఎమ్మెల్యేలలో లాస్య నందిత కూడా ఒకరు. చదువురిత్యా ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది నందిత. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. సాయన్నకు కొడుకైనా కూతురైనా లాస్యనే అవడంతో.. తండ్రి బాటలో పొలికల్‌ ఎంట్రీ ఇచ్చింది.

ఆయన తరువాత ఆ సీట్లో తాను కూర్చుంది అనుకున్నారు కానీ.. సాయన్న లాగే లాస్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ లాస్యను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. డిసెంబర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన లాస్య లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. లిఫ్ట్‌ కేబుల్స్‌ తెగిపోవడంతో దాదాపు 3 గంటలు లిఫ్ట్‌లోనే ఉన్నారు. ఆ తరువాత రీసెంట్‌గా కేసీఆర్‌ (KCR) నల్గొండలో ఏర్పాటు చేసిన సభకు వెళ్లి వస్తుండగా కూడా లాస్యకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య తలకు గాయమైంది. ఇప్పుడు మరోసారి కారు ప్రమాదం జరగడంతో లాస్య చనిపోయింది. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్న లాస్య ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఆమె కుంటుబానికే కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి కూడా తీవ్ర నష్టం.