KCR’s Bus Trip : మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర.. రోడ్ షో.. ఏపీ సీఎం జగన్ బాటలోనే తెలంగాణ మాజీ సీఎం ప్రచారం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రథసారథి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన TRS - BRS పార్టీ అధినేత.. తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. గతంలో ఎప్పుడు చేయని ప్రచారం కు సిద్దం అవుతున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ..

కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రథసారథి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన TRS – BRS పార్టీ అధినేత.. తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. గతంలో ఎప్పుడు చేయని ప్రచారం కు సిద్దం అవుతున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ సత్తా చాటాలి కంకణం కట్టుకుంది. అధికారం పోయిన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అన్న సంకేతాలను నిత్యం ప్రజల్లోకి పంపిస్తున్నే ఉన్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు.

దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటికాలితో కేసీఆర్ ఎన్నికల ప్రచారం జరుపుతునే ఉన్నారు. ప్రజా ఆశిర్వాద సభలతో అధికా పార్టీకి పంచుల వర్షం కురిపిస్తునే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర లోగా పడిపోతుంది అని.. తాము ముట్టుకోకుండానే ప్రభుత్వం పడిపోతుంది. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందు ముందు 2001 -2014 వరకు ఉన్న ఉద్యమ కేసీఆర్ (KCR) ను చూడబోతున్నారని రాష్ట్ర ప్రజలకు చేప్పుకోచ్చారు.

అక్కడితో ఆగకుండా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని.. ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి.. ఏకంగా ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్ (CM Jagan) మాదిరి.. బస్సు యాత్రను చేపట్టనున్నారు. బస్సు యాత్రకు సర్వం సిద్ధం అన్నట్లుగా.. అన్ని కార్యక్రమాలు కూడా చకచక అపోయాయి. ఇక పోతే పార్లమెంట్ ఎన్నికలకు 3 వారాలు సమయం మాత్రమే ఉంది. దీంతో బస్సు యాత్ర చేస్తే.. అక్కడే రోడ్ షోలు.. భారీ బహిరంగ సభలో ప్రజలను ఓటర్లను.. మరింత ప్రసన్నం చేసుకునేందుకు సమయం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈనెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. మే 10న సిద్ధిపేట బహిరంగ సభతో యాత్ర ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర చేస్తున్నారు.

విడుదలైన బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ రోడ్ షోల షెడ్యూల్ 👇

  • 1వ రోజు – ఏప్రిల్ 24 – మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM, సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)
  • 2వ రోజు – ఏప్రిల్ 25 – భువనగిరి రోడ్ షో – 06.00 PM, ఎర్రవల్లిలో (రాత్రి బస)
  • 3వ రోజు – ఏప్రిల్ 26 – మహబూబ్ నగర్‌లో రోడ్ షో – 06.00 PM, మహబూబ్ నగర్ (రాత్రి బస)
  • 4వ రోజు – ఏప్రిల్ 27 – నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM
  • 5వ రోజు – ఏప్రిల్ 28 – వరంగల్ రోడ్ షో – 06.00 PM, వరంగల్ (రాత్రి బస)
  • 6వ రోజు – ఏప్రిల్ 29 – ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)
  • 7వ రోజు – ఏప్రిల్ 30 – తల్లాడ లో రోడ్ షో – 05.30 PM, కొత్తగూడెం లో రోడ్ షో – 06.30 PM, కొత్తగూడెంలో (రాత్రిబస)
  • 8వ రోజు – మే 1 – మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM, వరంగల్‌లో (రాత్రి బస)
  • 9వ రోజు – మే 2 – జమ్మికుంట రోడ్ షో – 06.00 PM, వీణవంకలో (రాత్రి బస)
  • 10వ రోజు – మే 3- రామగుండం రోడ్ షో – 06.00 PM, రామగుండంలో రాత్రిబస
  • 11వ రోజు – మే 4 – మంచిర్యాల రోడ్ షో – 06.00 PM, కరీంనగర్ లో (రాత్రి బస)
  • 12వ రోజు – మే 5 -జగిత్యాల రోడ్ షో – 06.00 PM, జగిత్యాలలో (రాత్రి బస)
  • 13వ రోజు – మే 6 – నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM, నిజామాబాద్‌లో (రాత్రి బస)
  • 14వ రోజు – మే 7 – కామారెడ్డి రోడ్ షో – 05.30 PM, మెదక్ రోడ్ షో – 07.00 PM, మెదక్‌లో (రాత్రి బస)
  • 15వ రోజు – మే 8- నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM, పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM, ఎర్రవెల్లిలో (రాత్రి బస)
  • 16వ రోజు – మే 9 – కరీంనగర్ రోడ్ షో – 06.00 PM, కరీంనగర్‌లో (రాత్రి బస)
  • 17వ రోజు – మే 10 – సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM, సిద్దిపేట బహిరంగ సభ – 06.30 PM
    హైదరాబాద్ (రాత్రి బస)

SSM