తెలంగాణ (Telangana) మాజీ ముఖ్యమంత్రి భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) (BRS) అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు.. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటి సారిగా ప్రతిపక్ష హోదాలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
రేపు మార్చ్ 31న తెలంగాణలోని జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అవలంభిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సమయం చూసి కాదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని అన్నారు.
నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో అరా తీసారు కేసీఆర్…అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్న బీఆర్ఎస్ …కరువుకు ఎండిన పంటల పరిశీలన చేయనుంది. కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు రానున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
SURESH.SSM